Site icon HashtagU Telugu

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట సినిమాలో చివిరి సాంగ్‌ షూటింగ్‌..

Sarkaru Vaati Paata Imresizer

Sarkaru Vaati Paata Imresizer

ప్రిన్స్ మ‌హేష్‌బాబు న‌టిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో చివరి సాంగ్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింద‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. దర్శకుడు పరశురామ్ ఈ రోజు సెట్స్ నుండి కొన్ని చిత్రాలను ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పంచుకున్నారు. చివరి పాట షూటింగ్ జ‌రుగుతున్న చిత్రాల‌ను ఆయ‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు.

యువ చిత్రనిర్మాత పరశురామ్ దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌తో కలిసి GMB ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ కథానాయికగా కనిపించనుంది. వెన్నెల కిషోర్, సుబ్బరాజు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్‌ఎస్‌ థమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, పీఎస్‌ వినోద్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాతో మహేష్ బాబు, ఎస్ఎస్ థమన్ ఏడేళ్ల తర్వాత సినిమా చేస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా 12 మే, 2022న థియేటర్లలోకి రానుంది!