Site icon HashtagU Telugu

Modi: ఫకీరు కాదు: ఎంపీ సంజయ్ రౌత్

Template (73) Copy

Template (73) Copy

శివసేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై తనదైన శైలిలో విమర్శలు చేశారు. తన కాన్వాయ్‌లో మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్ 650 కారును చేర్చుకోవడంతో ఇక నుంచి మోడీ ఫకీరు అని చెప్పుకొడని రౌత్ అన్నారు. ఈ మేరకు సామ్నా పత్రిక లో మోడీని ఉద్దేశించి ప్రస్తావించారు.మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు దేశీయంగా తయారైన కార్‌ను వినియోగించారని అన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినప్పటికీ తన సెక్యూరిటీని ఇందిరా గాంధీ మార్చుకోలేదని గుర్తుచేశారు. తనను ఫకీరుగా, ప్రధాన సేవకుడిగా పిలుచుకునే వ్యక్తి విదేశీ కారును ఉపయోగిస్తున్నారు’ అని అన్నారు. స్వదేశీ ఉత్పత్తులు వాడమని ప్రజలకు చెబుతూ తాను మాత్రం విదేశీ కార్లను వినియోగిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాగా, ప్రధాని కాన్వాయ్‌లో మెర్సిడెస్-మేబ్యాక్ ఎస్ 650 గార్డ్‌ని ఇటీవలే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చేర్చింది.

Exit mobile version