Site icon HashtagU Telugu

Hemant Nagrale : సోష‌ల్ మీడియాలో ప‌ర్స‌న‌ల్ నెంబ‌ర్ పెట్టిన పోలీస్ క‌మీష‌న‌ర్.. ఇందుకోస‌మేన‌ట‌..?

Sanjay Pande

Sanjay Pande

ముంబై కొత్త పోలీస్ క‌మీష‌న‌ర్ సంజ‌య్ పాండే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు నేరుగా తానే విన‌నున్నారు. త‌న ప‌ర్స‌న‌ల్ ఫోన్ నెంబ‌ర్ ని ఫేస్‌బుక్ లో పోస్ట్ చేశారు. స‌మ‌స్య‌లు కానీ పోలీస్ వ్య‌వ‌స్థ‌లో మెరుగుప‌రుచుకునే అంశాల‌పై ప్ర‌జ‌ల సలహాలను పంచుకోవడానికి నేరుగా తనను సంప్రదించాలని కోరారు. సంజ‌య్ పాండే సుమారు 10 సంవత్సరాలు వివిధ స్థానాల్లో న‌గ‌రంలో పనిచేసిన అనుబంధాన్ని ఆయ‌న పంచుకున్నారు. ముంబయి పోలీసులకు అద్భుతమైన సంప్రదాయం, చరిత్ర ఉందని… ముంబై పోలీసులను ఎప్పుడూ స్కాట్లాండ్ పోలీసులతో పోలుస్తూ ఉంటార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో క‌మీష‌న‌ర్‌గా ముంబై పోలీస్ ఫోర్స్‌లో ప్ర‌జ‌ల‌కు సేవ చేసే అవ‌కాశం త‌న‌కు ద‌క్కిందని ఆయ‌న పేర్కోన్నారు. ఈ క్లిష్ట సమయాల్లో మరియు శాంతిభద్రతల పరంగా, మేము కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటామ‌ని… కాబట్టి, మీకు ముంబై పోలీస్ ఫోర్స్ పనిలో ఏదైనా మెరుగుదల (అవసరం) అనిపిస్తే, దానికి సంబంధించి మీకు ఏవైనా సూచనలు ఉంటే, దయచేసి నాకు 9869702747కు తెలియజేయండని ఆయ‌న త‌న నెంబ‌ర్ ని షేర్ చేశారు. కొన్నిసార్లు, చిన్న చిన్న సూచనలు కూడా పెద్ద మార్పులను కలిగిస్తాయని..అందువల్ల, తాము ఖచ్చితంగా సరైన సూచనలను జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నిస్తామ‌న్నారు.

Exit mobile version