Site icon HashtagU Telugu

Sanjay Dutt : ఎన్నికల్లో పోటీపై సంజయ్ దత్ సంచలన ప్రకటన

Sanjay Dutt Sensational Sta

Sanjay Dutt Sensational Statement on Contesting Elections

Sanjay Dutt: బాలీవుడ్ న‌టుడు(Bollywood actor) సంజ‌య్ ద‌త్(Sanjay Dutt) రాజ‌కీయ ఎంట్రీ(Political entry)పై క్లారిటీ ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేర‌డం లేద‌న్నారు. ఏ ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయ‌డం లేద‌న్నారు. అన్ని రూమ‌ర్స్‌కు చెక్ పెట్టాల‌ని భావిస్తున్న‌ట్లు సంజ‌య్ ద‌త్ త‌న ఎక్స్ అకౌంట్‌లో తెలిపారు. ఒక‌వేళ తాను ఎన్నిక‌ల్లోకి రావాల‌ని అనుకుంటే, తాను ఆ విష‌యాన్ని ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు చెప్పారు. త‌న గురించి మీడియాలో ప్ర‌చారం అవుతున్న వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్దు అని ద‌త్ తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా, 64 ఏళ్ల సంజ‌య్ ద‌త్‌.. రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో హ‌ర్యానాలోని క‌ర్నాల్ స్థానం నుంచి కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేస్తార‌ని ఇటీవ‌ల ఊహాగానాలు వినిపించాయి. సీఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్టార్‌పై సంజ‌య్‌ను దించాల‌ని కాంగ్రెస్ భావిస్తున్న‌ట్లు వార్త‌లు వ్యాపించాయి.

Read Also: ఎన్నికల వేళ ఎంతమందిని జైల్లో వేస్తారు? : సుప్రీంకోర్టు

2009 లోక్‌‌సభ ఎన్నికల్లో సంజయ్ దత్ సమాజ్‌వాది పార్టీ అభ్యర్థిగా లక్నో నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అక్టోబర్‌లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ సంజయ్ దత్ రాజకీయాల్లో ప్రవేశించనున్నారన్న కథనాలు మహారాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఈ కథనాలను తోసిపుచ్చుతూ తన పొలిటికల్ ఎంట్రీపై వినిపిస్తున్న ఊహాగానాలకు సంజయ్ దత్ స్వయంగా ముగింపు పలికారు.