Site icon HashtagU Telugu

Sanjay Bandi: బండి సంజయ్ కు అడుగడుగునా అపూర్వ స్వాగతం

Sanjay Bandi

Sanjay Bandi

Sanjay Bandi released: కరీంనగర్ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఎంపీ బండి సంజయ్ కుమార్ కు కరీంనగర్ నుండి హైదరాబాద్ వరకు అపూర్వ స్వాగతం లభించింది. కరీంనగర్ కు వేలాదిగా తరలివచ్చిన బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్ కు సంఘీభావం ప్రకటిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. వారితో కలిసి బండి సంజయ్ దాదాపు 2 కి.మీలకుపైగా నడిచారు.

కుట్రపూరితంగానే బండిని అరెస్ట్ చేయించారని మండిపడుతున్న కాషాయ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. కరీంనగర్ నుండి హైదరాబాద్ కు బయలుదేరిన బండి సంజయ్ కు బీజేపీ కార్యకర్తలు, ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. సిద్ధిపేట, ప్రజ్ఝాపూర్, తుర్కపల్లి, శామీర్ పేట్, లోతుకుంట, అల్వాల్ లో భారీ ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి బాణా సంచా పేల్చి స్వాగతం పలికారు. చాలా చోట్ల పూలు చల్లి, సెల్ఫీలు దిగుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతీచోటా వారి స్వాగత కార్యక్రమాన్ని చూసి ఆగిన బండి సంజయ్ వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అడుగడుగునా కార్యకర్తలు ఘన స్వాగతం పలకడంతో కరీంనగర్ నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఎక్కువ సమయమే పట్టింది.

బండి సంజయ్ నిర్ణీత సమయానికంటే గంట ఆలస్యంగా సికింద్రాబాద్ పరేడ్ మైదానానికి చేరుకోవాల్సి వచ్చింది. రేపు ప్రధాని పర్యటన నేపథ్యంలో పలువురు సీనియర్ నేతలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. రాత్రి 9.40 గంటలకు పరేడ్ మైదానానికి వచ్చినఆయన పార్టీ నేతలతో కలిసి ప్రధాని బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఇదిలా ఉంటే
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో హైశనివారం ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి.