Site icon HashtagU Telugu

Hyderabad : జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు పారిశుద్ధ్య కార్మికురాలి ఆత్మహత్యయత్నం..!!

GHMC

GHMC

హైదరాబాద్ లో లిబర్టీ సర్కిల్లో ఉన్న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు పారిశుద్ధ్య కార్మికురాలు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించింది. అక్కడున్న సెక్యూరిటి సిబ్బంది అడ్డుకున్నారు. బాధితురాలు జియాగూడకు చెందని లక్ష్మీగా గుర్తించారు. వేతనాలు రాకపోవడంతోపాటు సూపర్ వైజర్ తనను వేధిస్తున్నాడంటూ మనస్తాపానికి గురైన ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.