Site icon HashtagU Telugu

Sania Mirza: టెన్నిస్ స్టార్ సానియా సంచలనం.. ఆటకు గుడ్ బై!

Saniya

Saniya

టెన్నిస్ అనగానే.. చాలామందికి ముందుగా గుర్తుకువచ్చే సానియామిర్జానే. అలాంటి స్టార్ ప్లేయర్ సంచలనం నిర్ణయం తీసుకుంది. 2022 సీజన్ ముగిసే సమయానికి సానియా మీర్జా తన కెరీర్‌కు గుడ్ బై చెప్పనుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల డబుల్స్‌లో తొలి రౌండ్‌లో ఓడిపోయిన తర్వాత ఆమె ఈ విషయాన్ని ప్రకటించింది. ఆమె నదియా కిచెనోక్‌తో కలిసి తమరా జిదాన్‌సెక్ మరియు కాజా జువాన్‌లపై 4-6, 6-7 తేడాతో ఓడిపోయింది. ఈ సందర్భంగా ఆమె రియాక్ట్ అవుతూ..

అందుకు చాలా కార‌ణాలున్నాయి. గ‌తంలో లాగా కాదు. ఆట పూర్త‌యిన త‌ర్వాత కీళ్లు విప‌రీతంగా నొప్పులు వ‌స్తున్నాయి. పెద్ద వాళ్లు అవుతున్న‌కొద్దీ రిక‌వ‌రీ స‌మ‌యం పెరుగుతుంది. ఇంత‌కుముందులా ఆట‌ని ఆస్వాదించ‌లేక‌పోతున్నాను కూడా.

 

‘‘దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. నేను సరిగ్గా ఆడటం లేదు. టెన్నిస్ కారణంగా నా 3 ఏళ్ల కొడుకును ప్రమాదంలో పడేస్తున్నాను. నా శరీరం క్షీణిస్తోంది అని నేను అనుకుంటున్నాను. నా మోకాలి ఈ రోజు నిజంగా నొప్పిగా ఉంది. ఓడిపోయామని నేను చెప్పడం లేదు. కానీ కోలుకోవడానికి సమయం పడుతుందని నేను అనుకుంటున్నాను నాకు వయసు పెరుగుతోంది. 2022 చివరి సీజన్’’ అని చెప్పింది. ప్రస్తుతం డబుల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ మాత్రమే ఆడుతున్న సానియా.. 2013లో సింగిల్స్ పోటీ నుంచి తప్పుకుంది. సానియా సింగిల్స్‌ కెరీర్‌లో అత్యుత్తమంగా 27వ ర్యాంక్‌కు చేరుకుంది