భారత టెన్నిస్ స్టార్ సానియామీర్జా రిటైర్మెంట్‌పై పునరాలోచనలో పడినట్టు కనిపిస్తోంది. తొందరపాటుతో ప్రకటన చేసానంటూ వ్యాఖ్యానించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్సిడ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్‌లో ఓటమి తర్వాత సానియా ఆటకు గుడ్‌బై చెప్పడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బ్రాడ్‌కాస్టర్ సోనీ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ సానియా రిటైర్మెంట్‌పై చాలా త్వరగా ప్రకటించనట్టున్నానంటూ చెప్పడంతో ఆమె యూటర్న్ తీసుకున్నట్టు అర్థమవుతోంది. నిజాయితీగా చెప్పాలంటే ఇంకా టెన్నిస్ ఆడాలనే అనుకుంటున్నానని సానియా వ్యాఖ్యానించింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్‌లో తొలి రౌండ్ ఓటమి తర్వాత సానియా రిటైర్మెంట్‌పై ప్రకటన చేసింది. ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఎక్కువ రోజులు ఆటలో కొనసాగలేకపోవచ్చని చెబుతూ ఈ సీజన్ తర్వాత వీడ్కోలు పలుకుతున్నట్టు వెల్లడించింది.
నిజానికి షోయబ్ మాలిక్‌తో వివాహం తర్వాత ఆమె ఆటకు గుడ్‌బై చెబుతుందని భావించినా కేవలం బ్రేక్ మాత్రమే ఇచ్చింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత దాదాపు రెండేళ్ళు ఆటకు దూరమైన సానియా మళ్ళీ ఫిట్‌నెస్ సాధించి రీఎంట్రీ ఇచ్చింది. అయితే రీఎంట్రీలో అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. దీనికి తోడు శరీరం సహకరించడం లేదన్న హైదరాబాదీ ఇక ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్టు హింట్ ఇచ్చింది. తాజాగా రిటైర్మెంట్‌పై భిన్నంగా స్పందించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. రిటైర్మెంట్ ఆలోచలను ఉన్నప్పటకీ… ఫిట్‌గా ఉన్నంత కాలం ఆడతానని స్పష్టం చేసింది. టెన్నిస్ ఆడడాన్ని ఎప్పుడూ ఆస్వాదిస్తానన్న సానియా 100 శాతం బెస్ట్ ఇచ్చేందుకే ప్రయత్నిస్తానని తెలిపింది.