Site icon HashtagU Telugu

Samyukta Menon : మలయాళ భామ బాలీవుడ్ ఆఫర్..!

Samyukta Menon Bollywood Offer

Samyukta Menon పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు సినిమాల హంగామా తెలిసిందే. బాహుబలి తర్వాత బాలీవుడ్ మీద కూడా మన సౌత్ సినిమాల దండయాత్ర ఒక రేంజ్ లో కొనసాగుతుంది. రాజమౌళి తీసిన బాహుబలి ముందు వరకు సౌత్ సినిమా అంటే కేవలం ఒక ప్రాంతీయ సినిమా మాదిరిగానే ఉంటూ ఒక మోస్తారు కలెషన్స్ రాబట్టేవి. కానీ ఎప్పుడైతే బాహుబలి రెండు భాగాలు వచ్చిందో సౌత్ సినిమాల మార్కెట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఆ సినిమా వేసిన బాటలోనే చాలా సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధిస్తూ వచ్చాయి.

హీరోలే కాదు హీరోయిన్స్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో ఛాన్సులు అందుకుంటూ సత్తా చాటుతున్నారు. సౌత్ సినిమాల్లో బాలీవుడ్ భామల ఎంట్రీ చాలా తక్కువ అదీగాక వారు రెమ్యునరేషన్ కూడా భారీగా డిమాండ్ చేస్తారు. అందుకే వారిని పెద్దగా సౌత్ సినిమాల్లోకి తీసుకునే ఛాన్స్ ఉండదు.

ఇదిలాఉంటే ప్రస్తుతం నడుస్తున్న పాన్ ఇండియా మూమెంట్ లో భాగంగానే సౌత్ హీరోలకే కాదు ఇక్కడ కథానాయికలకు కూడా డిమాండ్ ఏర్పడింది. వారికి కూడా హిందీలో వరుస అవకాశాలు వస్తున్నాయి. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్ లో జవాన్ తో సక్సెస్ అందుకుని వరుస ఛాన్సులు కొట్టేస్తుంది. మరో హీరోయిన్ సాయి పల్లవి కూడా బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తుని. ఇదే దారిలోనే మరో మలయాళ భామ సంయుక్త మీనన్ కూడా బాలీవుడ్ ఛాన్స్ అందుకుంది. హిందీలో తెరకెక్కుతున్న మహారగ్ని సినిమాలో ఛాన్స్ అందుకుంది సం యుక్త. సౌత్ లో తన నటనతో ఆకట్టుకుంటున్న అమ్మడు బాలీవుడ్ లో కూడా టాలెంట్ చూపించి అక్కడి ఆడియన్స్ ని బుట్టలో వేసుకోవాలని చూస్తుంది.

Exit mobile version