Samsung Galaxy M53: శామ్‌సంగ్ గెలాక్సీ M53 5G ఫోన్ ఎలా ఉంది? వాటి ఫిచర్లు ఏంటంటే…

ప్రస్తుతం మార్కెట్ లో ఎక్కువ శాతం అమ్ముడు అవుతున్న బ్రాండ్లలో శామ్‌సంగ్ కూడా ఒకటి. ఈ శామ్‌సంగ్ ఫోన్లు

  • Written By:
  • Publish Date - July 9, 2022 / 05:40 PM IST

ప్రస్తుతం మార్కెట్ లో ఎక్కువ శాతం అమ్ముడు అవుతున్న బ్రాండ్లలో శామ్‌సంగ్ కూడా ఒకటి. ఈ శామ్‌సంగ్ ఫోన్లు ప్రస్తుతం మార్కెట్లో అన్ని రకాల శ్రేణుల్లో అందుబాటులో ఉంటున్నాయి. అంతేకాకుండా వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకుని వస్తున్నారు ఇది ఇలా ఉంటే తాజాగా శామ్‌సంగ్ కంపెనీ ఎం సిరీస్లో మరొక కొత్త ఫోన్ ని లాంచ్ చేసింది. ఎం సీరియస్ లో గెలాక్సీ ఎం53 5జీ డివైజ్ ను లాంచ్ చేసింది. కాగా ఇది గత సంవత్సరం మార్కెట్ లోకి వచ్చినా గెలాక్సీ ఎం52 స్మార్ట్ ఫోన్ కు అప్డేట్ వెర్షన్. అయితే తాజాగా లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 26,499. ఇతర బ్రాండ్ల మాదిరిగానే ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఎక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈ శామ్‌సంగ్ ఫీచర్ ల విషయానికి వస్తే..

గెలాక్సీ ఎం53 5జీ 176 గ్రాముల బరువుతో పాటు సొగసైన ఫ్రేమ్‌తో వస్తుంది. ఫోన్‌ చాలా తేలికగా ఉంటుంది. ఫోన్‌లో బ్యాటరీ ఉందా లేదా అని ఆశ్చర్యపడే అంత నాజూకుగా కనిపిస్తుంది. ఫోన్ హెడ్‌ఫోన్ జాక్‌ ఉండదు, SIM స్లాట్‌తో పాటు పవర్, వాల్యూమ్ బటన్‌లు మాత్రమే ఉంటాయి. క్వాడ్ రియర్ కెమెరాలు, స్వేర్ షేప్డ్ మాడ్యూల్‌లో ఉంటాయి. పైభాగంలో పంచ్-హోల్ కటౌట్‌ వస్తుంది. శామ్‌సంగ్‌ గెలాక్సీ డిస్ప్లే ఎం53 5జీ 6.7అంగుళాల ఫుల్‌ హెచ్ డీ + సూపర్ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 85.3 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో ఉంటుంది. AMOLED ప్యానెల్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

అలాగే గెలాక్సీ ఎం53 5జీని మీడియాటెక్‌ డైమెన్సిటీ 900 చిప్‌సెట్‌, 6జీబీ లేదా 8జీబీ ర్యామ్ తో వస్తుంది. సిమ్ స్లాట్‌ని ఉపయోగించి 128జీబీ వరకు స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. గెలాక్సీ ఎం53 5జీ సరికొత్త ఆండ్రాయిడ్‌ 12 బేస్డ్‌ వన్ యుఐ 4.1 వెర్షన్‌తో వస్తుంది. ఇది కంపెనీ నుంచి 2 సంవత్సరాల OS అప్‌డేట్, నాలుగు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందుతుందని స్పష్టం చేసింది. వెర్షన్ 4.0తో యుఐ ఇంటర్‌ఫేస్ అందంగా కనిపిస్తుంది. శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం53 5జీ స్మార్ట్‌ఫోన్‌ 108మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్‌తో క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్. గెలాక్సీ ఎం53 5జీ ఫోన్‌ 5,000mAh బ్యాటరీ వస్తుంది. ఈ ఫోన్‌తో బాక్స్‌లో ఛార్జింగ్ అడాప్టర్ లేదా USB టైప్ సి కేబుల్‌ను అందించడం ఆపేసింది.