డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) ఛైర్మన్‌గా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీగా శాస్త్రవేత్త సమీర్ వి కామత్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల జారీ చేసింది. కామత్ ప్రస్తుతం డిఆర్‌డిఒలో నేవల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. కామత్‌కు 60 ఏళ్లు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పదవిలో ఉంటారు.
ప్రస్తుత డిఆర్‌డిఒ ఛైర్మన్ జి.సతీష్‌రెడ్డి రక్షణ మంత్రికి సైంటిఫిక్ అడ్వైజర్‌గా నియమితులయ్యారు. 2020 ఆగస్టు 24 నుంచి డిఆర్‌డిఒ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరుకు చెందిన సతీష్ రెడ్డి పదవీ కాలం శుక్రవారంతో ముగియనుంది.