Site icon HashtagU Telugu

Samantha: సమంత మరో ప్యాన్ ఇండియా మూవీ!

Samantha

Samantha

సినీ కెరీర్ పరంగా టాలీవుడ్ బ్యూటీ సమంత జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఆమె చేతిలో పలు కీలక సినిమాలు ఉన్నప్పటికీ, మరికొన్ని సినిమాలకు సైన్ చేస్తోంది. అందులో కొన్ని ప్రాంతీయ సినిమాలు అయినప్పటికీ, మరికొన్ని పాన్ ఇండియా మూవీస్ కావడం విశేషం. ఇటీవల తమిళ మల్టీస్టారర్ ‘కాతువాకుల రెండు కాదల్’లో కనిపించిన సమంతా రూత్ ప్రభు మరో పాన్ మూవీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయమై సమంత త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఓ యువ చిత్రనిర్మాత దర్శకత్వం వహించే చిత్రానికి సమంత ఓకే చెప్పినట్టు టాక్. ప్రస్తుతానికి ప్రారంభం కాని ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను నిర్మాతలు గోప్యంగా ఉంచారు. ప్రైమ్ వీడియోతో సమంత వెబ్ సిరీస్ ఒప్పందం కూడా చేసుకుంది. హరి శంకర్, హరీష్ నారాయణ్ ద్వయం దర్శకత్వం వహించిన ‘యశోద’లో సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆమె పౌరాణిక ప్రేమ కథ ‘శాకుంతలం’ సినిమా కూడా షూటింగ్ జరుపుకుంటోంది.

 

Exit mobile version