Site icon HashtagU Telugu

Samajwadi Party Chief : ములాయం సింగ్ ఆరోగ్య పరిస్థితి విషయం..ఐసీయూలో చికిత్స..!!

Mulayam

Mulayam

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఆదివారం ఆకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం విషమించడంతో ఐసీయూలో చేర్చారు. అనారోగ్యంతో ఆయన చాలా రోజులుగా గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యాన్ని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్, అతని భార్య డింపుల్ యాదవ్ ఆసుపత్రికి చేరుకున్నారు. అఖిలేష్‌తో పాటు ములాయం సోదరుడు ప్రొ. రాంగోపాల్ కూడా ఉన్నారు.

ఆగస్టు 22 నుండి మేదాంత ఆసుపత్రిలో చేరిన ములాయం సింగ్, మేదాంతలో చేరిన ఆంకాలజిస్ట్ డాక్టర్ నితిన్ సూద్ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం అతని ఆరోగ్యం క్షీణించడంతో, వైద్యులు అతనిని ఐసియుకు తరలించారు. పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.