Site icon HashtagU Telugu

Salistick: ప్రెగ్నెంట్ మహిళలకు శుభవార్త.. ఇకపై లాలాజలంతో ప్రెగ్నెన్సీ టెస్ట్?

Salistick

Salistick

ఇదివరకటి రోజుల్లో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి స్త్రీలు వైద్యుల దగ్గరికి వెళ్లేవారు. కానీ ఆ తర్వాత కాలంలో హోం టెస్ట్ కిట్టులో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో వైద్యుల దగ్గరికి వెళ్ళకుండానే ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించుకుంటున్నారు. యూరిన్ ని ఉపయోగించి ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకుంటున్నారు. కానీ ఈ విషయంలో వైద్యులు కాస్త విన్నూత్నంగా ఆలోచించి ఇకపై యూరిన్ తో కాకుండా కేవలం ఉమ్మితోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందో లేదో తెలుసుకోవచ్చు.

అందుకోసం ఒక కిట్‌ యూకేలో లాంఛ్‌ కాగా అతి త్వరలో అది ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే ఈ తరహా తొలి ఉత్పత్తి ఇదే కావడం గమనార్హం. వైద్య, సాంకేతిక రంగంలో విప్లవాత్మక అడుగు పడింది. లాలాజలంతో గర్భనిర్ధారణ కిట్‌ అందుబాటులోకి వచ్చింది. జరూసలెంకు చెందిన సాలిగ్నోస్టిక్స్‌ అనే బయోటెక్‌ స్టార్టప్‌ కంపెనీ దీనిని తయారు చేసింది. ఈ ఉత్పత్తికి సాలిస్టిక్‌ గా నామకరణం కూడా చేశారు. ఏడాది ప్రయత్నాల తర్వాత తాజాగా యూకేలో దీనిని లాంఛ్‌ చేశారు.

యూకేతో పాటు ఐర్లాండ్‌ లో కూడా వీటి అమ్మకాలు మొదలయ్యాయి. అలాగే అమెరికాలో కూడా అమ్మకాల కోసం ఎఫ్‌డీఏ అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది ఈ కంపెనీ ఇంతకాలం యూరిన్‌ బేస్డ్‌ హోంటెస్ట్‌ కిట్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఇకపై ఈ సెలైవాతో ప్రెగెన్సీ టెస్ట్‌ కిట్‌లు అందుబాటులోకి రానున్నాయి. కరోనా టెస్టింగ్‌ కిట్స్‌ సాంకేతికతను ఉపయోగించే ఈ సెలైవా ప్రెగ్నెన్సీ టెస్ట్‌ కిట్‌లు తయారు చేయడం గమనార్హం. కాగా వీటిని ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించవచ్చు. థర్మామీటర్‌ను ఉంచుకున్నట్లే కిట్‌లో వచ్చే స్టిక్‌ను నోట్లో పెట్టుకుని కాసేపు ఉంచితే అది లాలాజలాన్ని సేకరిస్తుంది. ఆపై ఫలితం కోసం ఐదు నుంచి పది నిమిషాల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. ఒక్కోసారి మూడు నిమిషాల్లోనూ చూపించే అవకాశం ఉంది. స్టిక్‌ తొలుత లాలాజలాన్ని సేకరించి దానికి ప్లాస్టిక్ ట్యూబ్‌కు బదిలీ చేస్తుంది, అక్కడ జీవరసాయన ప్రతిచర్య జరిగి ఫలితం వెలువడుతుంది.