Government Jobs for Engineers: నెలకు రూ.1.80 లక్షల జీతం.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గవర్నమెంట్ జాబ్స్

35 ఏళ్లలోపు వయసు కలిగిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గొప్ప అవకాశం. నెలకు రూ. 60,000 నుంచి రూ.1,80,000 మధ్య జీతం సంపాదించే గొప్ప ఛాన్స్.

Government Jobs for Engineers : 35 ఏళ్లలోపు వయసు కలిగిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కు గొప్ప అవకాశం. నెలకు రూ. 60,000 నుంచి రూ.1,80,000 మధ్య జీతం సంపాదించే గొప్ప ఛాన్స్. ప్రభుత్వ (Government) రంగ సంస్థ అయిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కన్‌స్ట్రక్షన్ రంగంలో E3 స్థాయిలో ఇంజనీరింగ్‌లోని వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం సంస్థ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ విభాగాల్లో మొత్తం 66 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను ఎన్‌టీపీసీ భర్తీ చేయనుంది.అర్హతలు కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ntpc.co.in ద్వారా ఏప్రిల్ 21లోపు అప్లై చేసుకోవచ్చు.

ఒక్కో పోస్ట్ కు అర్హతలు ఇవీ..

అసిస్టెంట్ మేనేజర్(ఎలక్ట్రికల్):

ఈ పోస్టుకు అప్లై చేసుకునే అభ్యర్థులు బీఈ లేదా బీటెక్‌లో ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్‌ విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎలక్ట్రికల్ విభాగంలో అభ్యర్థులకు కనీసం 7 ఏళ్ల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. 132 kV సబ్‌స్టేషన్‌లో పనిచేసిన వారికి, LT / MV/ HT స్విచ్‌గేర్స్, పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌లలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.

అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్):

ఈ పోస్ట్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి బీఈ/బీటెక్‌లో మెకానికల్ లేదా ప్రొడక్షన్‌లో కనీసం 60 శాతం స్కోర్ చేసి ఉండాలి. థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లోఎక్విప్‌మెంట్ ఎరెక్షన్ /మెకానికల్ ఎరెక్షన్/స్ట్రక్చరల్ స్టీల్ ఎరెక్షన్ వర్క్‌లో అభ్యర్థులకు కనీసం 7 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌పీరియన్స్ తప్పనిసరి. ప్రెజర్ పార్ట్స్ ఎరెక్షన్, హెవీ ఎక్విప్‌మెంట్ ఇన్‌స్టాలేషన్స్, మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్, స్టీమ్ టర్బైన్ & జనరేటర్ విభాగాల్లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

అసిస్టెంట్ మేనేజర్ (సివిల్):

ఈ పోస్టుకు అప్లై చేసుకునే అభ్యర్థులు బీఈ/బీటెక్‌లో సివిల్ లేదా కన్‌స్ట్రక్షన్‌లో కనీసం 60% మార్కులతో పాసై ఉండాలి. థర్మల్/హైడ్రో పవర్ ప్రాజెక్టులలో సివిల్ కన్‌స్ట్రక్షన్‌లో కనీసం 7 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్‌‌పీరియన్స్ ఉండాలి. పవర్ ప్లాంట్‌లో జనరల్ సివిల్ వర్క్స్, టాల్ స్ట్రక్చర్ (చిమ్నీ/నేచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్), వ్యాగన్ టిప్లర్/ట్రాక్ హార్పర్/కూలింగ్ వాటర్ పంప్ హౌస్ వంటి డీప్ ఎక్స్‌కావేషన్ వర్క్స్‌లో ఎక్స్ పీరియన్స్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

దరఖాస్తు ఫీజులు:

జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.300 ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌ఎస్‌ఎం కేటగిరీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

Also Read:  Hyderabad Metro Jobs Notification: హైదరాబాద్ మెట్రోలో జాబ్స్.. ఏమేం పోస్టులు ఉన్నాయంటే..