YS Jagan : కాంట్రాక్టు లెక్చరర్లకు తీపికబురందించిన ఏపీ సర్కార్..!!

ఏపీ సర్కార్ కాంట్రాక్టు లెక్చరర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలను పెంచుతున్నట్లు జగన్ ప్రభుత్వం వెల్లడించింది. రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం మినిమం టైం స్కేల్ ను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు సొసైటీ కార్యదర్శి ఆర్ . నరసింహారావు తెలిపారు. మరోవైపు గ్రాంట్ ఇన్ పెయిడ్ కింద జీతాలను […]

Published By: HashtagU Telugu Desk
Cm Jagan

Cm Jagan

ఏపీ సర్కార్ కాంట్రాక్టు లెక్చరర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు జీతాలను పెంచుతున్నట్లు జగన్ ప్రభుత్వం వెల్లడించింది. రివైజ్డ్ పే స్కేల్ ప్రకారం మినిమం టైం స్కేల్ ను అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ పెంపు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు సొసైటీ కార్యదర్శి ఆర్ . నరసింహారావు తెలిపారు.

మరోవైపు గ్రాంట్ ఇన్ పెయిడ్ కింద జీతాలను పొందుతున్న ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులను విద్యాశాఖలో విలీనం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సంఘం కోరింది. ఇంకోవైపు ప్రభుత్వలో విలీనమైన ఎయిడెడ్ అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి 010 పద్దు కింద జీతాలు చెల్లించేలా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వడంపై హార్షం వ్యక్తమవుతోంది.

  Last Updated: 03 Jun 2022, 01:52 PM IST