Praja Galam : ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారు – సజ్జల

ఏపీలో మూడు పార్టీల కూటమి కొత్తేమీ కాదని, పదేళ్ల క్రితం ఇదే కూటమి అని .. ముగ్గురూ కలిసి ఆరోజు తిరుపతిలో ఆడిన నాటకం.. మళ్ళీ ఆడుతున్నారని ధ్వజమెత్తారు

  • Written By:
  • Publish Date - March 18, 2024 / 09:31 PM IST

ప్రజాగళం (Praja Galam) సభ ఫై వైసీపీ నేతలు (YCP Leaders) విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు స్పందించగా..తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ (Sajjala Ramakrishna Reddy)..చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లకు సూటి ప్రశ్నలు సంధించారు. ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారంటూ చంద్రబాబు (CBN) , పవన్ (Pawan) , మోడీ (Modi) లపై సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మూడు పార్టీల కూటమి కొత్తేమీ కాదని, పదేళ్ల క్రితం ఇదే కూటమి అని .. ముగ్గురూ కలిసి ఆరోజు తిరుపతిలో ఆడిన నాటకం.. మళ్ళీ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఆనాడు ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు సజ్జల. 2019లో చంద్రబాబు, పవన్ బీజేపీని తిట్టారు. మోడీని వ్యక్తిత్వ హననం చేశారు చంద్రబాబు. మళ్ళీ అదే చంద్రబాబు మోడీని పొగుడుతున్నారు. ముగ్గురూ కలిసి ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చెయ్యలేదో నిన్నటి సభలో చెప్పాల్సింది. ఎన్డీయే నుండి ఎందుకు విడిపోయారో? మళ్ళీ ఎందుకు కలిశారో చెప్పాల్సింది. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, ఇళ్ళ స్థలాలు వంటివి అమలు చేశారా..? మీరు సభలు పెట్టేది జగన్ ను తిట్టడానికా..? అని ప్రశ్నించారు.

We’re now on WhatsApp. Click to Join.

సభ నిర్వహించడం చేతగాక పోలీసులపై విమర్శలా? అని ప్రశ్నించారు. అర్జెంట్‌గా అధికారంలోకి రావాలనేది వారి ఆత్రమని దుయ్యబట్టారు. 2014లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? 2024లో మళ్లీ కలిసి స్టేజ్‌పై ప్రత్యక్షమయ్యారని అన్నారు. మళ్లీ ఇప్పుడెందుకు కలిశారో ప్రజలకు వివరణ ఇవ్వాలని సజ్జల నిలదీశారు. పొత్తు కోసం వెంపర్లాడటం, తర్వాత విడిపోవటం, మళ్ళీ కలవటం ఇదే వీరి పని అంటూ సజ్జల ఎద్దేవా చేసారు. కనీసం చిన్న సభను కూడా జరుపుకోలేని వారు ప్రజలకు ఏం మేలు చేస్తారు?. ప్రధానిని సైతం అవమానపరిచారు. కాంగ్రెస్, ఎకో ఒక్కటేనని ప్రధాని చెప్పగానే జనం నమ్ముతారా?. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రాష్ట్రానికి కావాల్సిన అంశాల గురించి మోదీని ఎందుకు అడగలేదు?. నాయకుడికి ఒక స్థిరమైన నిజాయితీ ఉండాలి. సీఎం జగన్ ప్రభుత్వంలో 87 శాతం కుటుంబాలు లబ్ది పొందాయి. అందుకే సీఎం జగన్‌ ప్రజలు ఓన్ చేసుకున్నారు. షర్మిల ఎక్కడ నుంచైనా పోటీ చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన పార్టీ కాబట్టి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదని సజ్జల రామ‌కృష్ణారెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు.

Read Also : CM Revanth Reddy Meeting With Sonia : సోనియా, ప్రియాంకా గాంధీలతో సీఎం రేవంత్ భేటీ