Site icon HashtagU Telugu

Sajjala Ramakrishna Reddy : కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబాన్ని వేధించింది : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీకి ష‌ర్మిలా మ‌ద్ద‌తు ఇవ్వ‌డంపై ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి స్పందించారు. జగన్మోహన్‌రెడ్డిని ఏ పార్టీ వేధించి అక్రమ కేసులు పెట్టారో ఆ పార్టీతో షర్మిల కలిశారన్నారు. షర్మిల ఓ పార్టీకి అధ్యక్షురాలని… ఆమె నిర్ణయాలు ఆవిడ ఇష్టమంటూ స‌జ్జ‌ల కామెంట్స్ చేశారు. త‌మ‌కు ఏపీకి చెందిన విషయాలే ముఖ్యమ‌ని.. కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ కుటుంబాన్ని వేధించిందని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు పెట్టిందని అందరికీ తెలుసని.. జగన్‌పై అక్రమ కేసులు పెట్టి వేధించింది కూడా కాంగ్రెస్ పార్టీనేన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కేవలం చంద్రబాబు ఫ్యామిలీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆమె కూడా వారం పది రోజుల నుంచే ఇలా మాట్లాడుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.