Site icon HashtagU Telugu

Hyderabad : ఫేక్‌బాబాపై కేసు న‌మోదు చేసిన సైఫాబాద్ పోలీసులు

Fake Baba Ramdas

Fake Baba Ramdas

హైదరాబాద్: ప్రజలను మోసం చేసి బెదిరించినందుకు భగవాన్ అనంత్ విష్ణు ప్రభు అలియాస్ రామ్ దాస్‌పై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఆ వ్యక్తి రవీంద్ర భారతి సమీపంలో ‘జై మహాభారత్ పార్టీ’ పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించాడు. ఇంటి స్థలాలు ఇస్తానంటూ , తన పార్టీలో సభ్యత్వం ఇప్పిస్తానంటూ పలువురి నుంచి ఆధార్ కార్డులు సేకరించాడు. ఇది పెద్ద ఎత్తున దుమారం రేగ‌డంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై ఆయ‌న‌పై కేసు న‌మోదు చేశారు. రామ్ దాస్ తన పార్టీని రిజిస్టర్ చేయించుకున్నారా లేదా అని ధృవీకరించాలని పోలీసులు ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తున్నారు.

Exit mobile version