Site icon HashtagU Telugu

KTR: రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్ పర్సన్ గా సాయి చంద్ సతీమణి

Ktr Imresizer

Ktr Imresizer

టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు కుసుమ జగదీష్, వేద సాయి చంద్ అకాల మరణానికి సంతాపం మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువ నాయకులు అకాల మరణం చెందడం పట్ల కెసిఆర్ ను ఎంతగానో కలచివేసిందన్నారు. వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకొని, వారి యోగక్షేమల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర 150 మందికి పైగా ప్రజాప్రతినిధుల ఒక నెల జీతం సుమారు మూడు కోట్లకు పైగా ఆ రెండు కుటుంబాలకు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

‘‘ఇరు కుటుంబాలకు కోటిన్నర చొప్పున అందిస్తాం, కుసుమ జగదీష్, సాయి చందు తల్లిదండ్రులను కూడా పార్టీ తరఫున ఆదుకుంటాము. సాయిచంద్ సతీమణి రజినీకి వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించిచారు’’ అని ఆయన తెలిపారు. ఈ మేరకు సింగర్ సాయిచంద్ సతీమణి రజినీకి రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ ఛైర్మన్‌ పదవిని ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.