AP BRS: రైల్వే ప్రయాణీకులకు భద్రత కరపు: ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట

రైలు ప్రమాదాలు నివారించడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు.

Published By: HashtagU Telugu Desk
Thota

Thota

AP BRS: విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి అలమండ సమీపంలో రైలు ప్రమాదం జరగటం దురదృష్టకరమని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రమాద ఘటనలో మృతి చెందిన ప్రయాణికుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇటీవల కాలంలో దేశంలో రైలు ప్రమాద ఘటనలు పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. రైలు ప్రమాదాలు నివారించడంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు.

ఒరిస్సాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటన మరవకముందే మరోమారు రైలు ప్రమాదం జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థలో లోపాలున్నా వాటిని సరిదిద్దుకుండా రైల్వే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు తూతు మంత్రంగా తాత్కాలిక చర్యలు చేపడుతున్నారే తప్ప అధికారులు శాశ్వతంగా ప్రమాదాలను నివారించలేకపోతున్నారన్నారు. రైల్వేలను ప్రైవేటుపరం చేసే దుష్ట ఆలోచనలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలన్నారు.

  Last Updated: 30 Oct 2023, 05:52 PM IST