Nepal Air Crash: నేపాల్ విమాన ప్రమాదంలో మరణించిన ఓ మహిళ దీనగాథ!

నేపాల్ లో భారీ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 72 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఓ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పడంతో భారీ ప్రమాదానికి గురైంది.

Published By: HashtagU Telugu Desk
Whatsapp Image 2023 01 16 At 20.19.09

Whatsapp Image 2023 01 16 At 20.19.09

Nepal Air Crash: నేపాల్ లో భారీ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 72 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఓ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పడంతో భారీ ప్రమాదానికి గురైంది. విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారిలో చాలా వరకు కాలి బూడిదైపోయారు. విమాన ప్రమాదంలో ప్రాణాలతో కొట్టు మిట్టాడిన వారు సాయం కోసం ఆరాటపడ్డారని తెలుస్తోంది.

నలుగురు విమాన సిబ్బందితో పాటు మొత్తం 72 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో మరణించిన ఓ మహిళ విషాద గాథ అందరి చేత కన్నీరు పెట్టిస్తోంది. ప్రమాదానికి గురైన యతి ఎయిర్ లైన్స్ ఏటీఆర్ 72 విమానంలో కోపైలెట్ గా ఉన్న అంజు ఖతివాడకు సంబంధించిన ఆమె వ్యక్తిగత జీవితం అందరికీ కంటిపడి పెట్టిస్తోంది.

అంజు ఖతివాడ భర్త కూడా కోపైలెట్ గా యతి ఎయిర్ లైన్స్ లో పని చేశాడు. 2006లో అతడు కోపైలెట్ గా ఉన్న విమానం నేపాల్ గంజ్ నుండి జుమ్లా వెళుతుండగా.. ప్రమాదానికి గురికావడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో 2010లో అంజు ఖతివాడ పైలెట్ కావాలని ఎంతో కష్టపడి ట్రెయినింగ్ తీసుకుంది. అయితే ఎలాగోలా అన్ని ప్రమాణ పరీక్షలు పూర్తి చేసుకొని కోపైలట్ గా ఎంపికైంది.

అయితే ఆమె కో పైలెట్ నుండి పైలెట్ గా ప్రమోట్ అవడానికి 100గంటల విమానం నడిపిన అవసరం కాగా.. చివరి గంటలు ఉండగా.. నేపాల్ లో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆమె మరణించడంతో పైలెట్ కావాలనే తన కల కలగానే మారింది. తన భర్త ఎలాగైతే విమాన ప్రమాదంలో మరణించాడో, అదే తరహాలో, అదే ఎయిర్ లైన్స్ లో పని చేస్తుండగానే విమాన ప్రమాదానికి గురై చనిపోయిన ఘటన అందరికీ కన్నీరు తెప్పిస్తోంది.

  Last Updated: 16 Jan 2023, 08:19 PM IST