Site icon HashtagU Telugu

Sabarimala: శ‌బ‌రిమ‌ల వెళ్లే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. స్పెషల్ ట్రైన్స్ ఇవే!

Trains

Trains

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు శ‌బ‌రిమ‌ల వెళ్లే ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త చెప్పింది. శ‌బ‌రిమ‌లకు ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపించేందుకు సిద్ధ‌మైంది. ప్ర‌యాణికుల ర‌ద్దీ ఉన్న రూట్ల‌లో ప్ర‌త్యేక రైళ్లను న‌డిపేందుకు రైల్వే శాఖ సిద్ధ‌మైంది. హైదరాబాద్‌-కొల్లం మధ్య శబరిమల ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 6 నుంచి జనవరి 10 వరకు ప్రతి మంగళవారం హైదరాబాద్‌-కొల్లం స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07127) నడపనున్నట్టు చెప్పారు.

ఈ రైలు హైదరాబాద్‌ నుంచి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి, బుధవారం సాయంత్రం 6 గంటలకు కొల్లం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో కొల్లం-హైదరాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07128) డిసెంబర్‌ 7 నుంచి జనవరి 11 వరకు నడపనున్నారు. ప్రతి బుధవారం రాత్రి 8.45 గంటలకు కొల్లంలో బయల్దేరి, శుక్రవారం తెల్లవారుజామున 1.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుతుంది.