Russia wildfire:రష్యాలోని ఉరల్ పర్వతాల్లో మంటలు చెలరేగాయి. సాధారణ స్థితి నుంచి ప్రమాద స్థాయికి చేరుకున్నాయి. గాలులు విరిగా వీస్తుండటంతో మంటల తీవ్రత మరింత పెరుగుతుందంటున్నారు అధికారులు. కాగా ఈ అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు 21 మంది మరణించారు.
ఓ వైపు రష్యాపై ఉక్రెయిన్ బాంబులతో విరుచుకుపడుతుంది. మరోవైపు అక్కడ అడవుల్లో మంటలతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రష్యాలోని ఉరల్ పర్వతాల్లో చెలరేగిన మంటల్లో ఇప్పటి వరకు 21 మంది చనిపోయారు. కుర్గాన్, సైబీరియా అడవుల్లో గత వారం రోజులుగా భీకర మంటలు చెలరేగుతున్నాయి. అదే సమయంలో ఈ అగ్నిప్రమాదం కారణంగా 5 వేలకు పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదాన్ని అరికట్టేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి మంటల్లో కాలి చనిపోయాడు. ఈ విషయాన్ని స్థానికులు చెప్పారు.
ఇటీవలి సంవత్సర కాలంలో రష్యాలో పెద్ద ఎత్తున అడవులు దగ్దమయ్యాయి. వేసవి మరియు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దీనికి కారణమని నిపుణులు పేర్కొన్నారు. తాజాగా వారం రోజులుగా అక్కడ భీకరంగా మంటలు వ్యాప్తి చెందుతుండటంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అధిక వేడి కారణంగా మంటలు తీవ్రత ఎక్కువ అవుతుంది స్థానిక మీడియా తెలిపింది.
Read More: Krishna River : జగన్ పై kCR ఆపరేషన్, సరే అంటే కృష్ణా వాటా ఔట్ !