Site icon HashtagU Telugu

Luna 25: రష్యా మూన్ మిషన్ ఫెయిల్.. ల్యాండర్‌లో సమస్యలు ?

Chandrayaan3 Moon Road

Chandrayaan3 Moon Road

Luna 25:  చంద్రుడి దక్షిణ ధృవం.. ఇప్పుడు రష్యా, ఇండియా రెండు దేశాల టార్గెట్ ఇదే..  మన ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ల్యాండర్ ఆగస్టు 23న  చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ కానుంది. మరోవైపు చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరుకోవడమే లక్ష్యంగా రష్యా ప్రయోగించిన  లూనా-25 ల్యాండర్‌లో ఇబ్బందులు తలెత్తాయి.  దీంతో అది సక్రమంగా, సక్సెస్ ఫుల్ గా చందమామపై ల్యాండ్ అవుతుందా ? కాదా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌ కాస్మోస్‌ వెల్లడించింది. ప్రస్తుతం లూనా-25  స్పేస్ క్రాఫ్ట్ చందమామ కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ల్యాండింగ్‌కు ముందు కక్ష్య (ప్రీ ల్యాండింగ్‌ ఆర్బిట్‌)కు చేరడానికి శనివారం రోజు లూనా-25 స్పేస్ క్రాఫ్ట్   కీలక విన్యాసాన్ని చేపట్టింది. ఆ ప్రయత్నంలో స్పేస్ క్రాఫ్ట్ లోని ఆటోమేటిక్‌ స్టేషన్‌లో ఎమర్జెన్సీ తలెత్తింది. దీంతో నిర్దేశిత పరిమితులకు అనుగుణంగా సంబంధిత విన్యాసం సాగలేదని రోస్‌ కాస్మోస్‌ తెలిపింది.

Also read : Weekly Horoscope: ఈవారం రాశి ఫలితాలు.. వారికి శత్రువులు మిత్రులవుతారు

ఈనేపథ్యంలో లూనా-25  ల్యాండింగ్‌ పై ఉత్కంఠ నెలకొంది. లూనా-25  స్పేస్ క్రాఫ్ట్ (Luna 25) ఇప్పటికే చందమామకు సంబంధించిన కొన్ని ఫొటోలను రోస్‌ కాస్మోస్‌ కంట్రోల్ సెంటర్ కు పంపింది.  దాదాపు 50 ఏళ్ల గ్యాప్ తర్వాత .. ఆగస్టు  11న లూనా-25  స్పేస్ క్రాఫ్ట్ ను  రష్యాలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ నుంచి ప్రయోగించారు. చంద్రుడి దక్షిణ ధృవ ప్రాంతంలోని బొగుస్లావ్‌స్కీ బిలానికి చేరువలో ఆగస్టు 21న లూనా-25  ల్యాండర్ ను దింపాలని రష్యా ప్లాన్ చేసింది. కానీ అలా జరిగే అవకాశాలు తగ్గాయనే సంకేతాలు వెలువడుతున్నాయి.

Also read : BJP Operation: బీజేపీ సీక్రెట్ ఆపరేషన్.. కమలంలోకి 22 మంది కీలక నేతలు