Luna-25 Tragedy: చంద్రుడిపై కూలిపోయిన రష్యా అంతరిక్షనౌక లూనా 25

రష్యా చేపట్టిన మూన్ మిషన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రష్యా అంతరిక్షనౌక లూనా 25 అంచనాలను అందుకోలేక పోయింది.

Luna-25 Tragedy: రష్యా చేపట్టిన మూన్ మిషన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. రష్యా అంతరిక్షనౌక లూనా 25 అంచనాలను అందుకోలేక పోయింది. చంద్రుడిపై దిగడానికి ముందే కూలిపోయింది. రష్యాకు చెందిన లూనా-25 (Russia Luna-25) అంతరిక్ష నౌక చంద్రునిపై కూలిపోయిందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్‌ను ఉటంకిస్తూ జర్మనీకి చెందిన డిడబ్ల్యు న్యూస్ తెలిపింది. ల్యాండింగ్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలిసింది. చంద్రుని కక్ష్య మారుతున్న సమయంలో ఈ లోపం వచ్చింది. ముందు నిర్ధేశించిన ప్రకారం ఆగస్టు 21 వ తేదీన జాబిల్లి దక్షిణ ధృవంపై లూనా 25 దిగాల్సి ఉంది. ఇందుకోసం ల్యాండింగ్‌కు ముందే క్లాస్ మార్చాల్సి ఉండగా సాంకేతిక సమస్య కారణంగా మార్చలేకపోయారు. 1976లో మొదటిసారిగా అప్పటి సోవియట్ యూనియన్‌లో లూనా-24 మిషన్ దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత, ఆగస్ట్ 10న లూనా-25 అంతరిక్షంలోకి పంపారు. అంటే దాదాపు 50 ఏళ్ల తర్వాత రష్యా లూనా 25 అంతరిక్షనౌకను ప్రయోగించింది. నిజానికి భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 3 కంటే ఆలస్యంగా.. రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్‌కాస్మోస్ లూనా -25 వ్యోమ నౌకను పంపించింది.

Also Read: Student Suicides: IIT హైదరాబాద్ క్యాంపస్‌లో తెలుగు విద్యార్థుల ఆత్మహత్యలు