Ukraine Russia War: కీవ్‌కు ద‌గ్గ‌ర‌గా ర‌ష్యా సేన‌లు..!

  • Written By:
  • Publish Date - March 16, 2022 / 10:12 AM IST

ఉక్రెయిన్ పై రష్యా దండ‌యాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో రష్యా సేనలు ఉన్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ర‌ష్యా సైనిక బ‌ల‌గాలు వేగంగా కీవ్ వైపు కదులుతున్న‌ట్టు తెలుస్తోంది. దాదాపు మూడు వారాలు నుంచి ఉక్రెయిన్‌తో భీక‌ర‌ యుద్దం జరుగుతున్నా, రష్యా సేనలు కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. అయితే ఇప్పుడు ర‌ష్యా బ‌ల‌గాలు కీవ్‌కు చేరువ అవుతున్నాయి. 19రోజులైనా ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను చేజిక్కించుకోలేకపోవడంతో దాడులు మరింత ముమ్మరం చేస్తోందని స‌మాచారం.

ఇక రష్యా సేనలు క్షిప‌ణులు, బాంబుదాడులతో పాటు కెమిక‌ల్ అటాక్స్‌కు రాష్యా ప్లాన్ చేస్తుంద‌ని తెలుస్తోంది. రష్యా క్షిపణులతో దాడులకు దిగుతుండటంతో నివాస భవనాలు కూడా నేలమట్టం అవుతున్నాయి. ఒక అపార్ట్ మెంట్ పైన క్షిపణి దాడి జరగడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ప‌ల‌వురు ఉక్రెయిన్ సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ర‌ష్యా బ‌ల‌గాలు యూనివర్సిటీపై కూడా దాడి చేయ‌డంతో, ఈ ఘటనలో కూడా ప‌లువురు ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఉక్రెయిన్‌లోని ప‌లు కీలక ప్రాంతాలపై క్షిపణులతో నిప్పుల వర్షం కురిపిస్తున్న రష్యా సైన్యం.. సైనిక స్థావరాల‌తో పాటు జనావాసాలను కూడా విడిచిపెట్టడం లేదు.