Site icon HashtagU Telugu

Omicron : ఒమిక్రాన్ కు సబ్ వేరియంట్లు…చాలా డేంజర్ అంటోన్న నిపుణులు..!!

Union Health Ministry

Union Health Ministry

రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి ఎన్నో వేరియంట్లుగా రూపాంతరం చెందుతోంది. కొన్ని నెలల కిందట ఒమిక్రాన్ రూపంలోనూ విజృంభించిన సంగతి తెలిసిందే. అయితే రష్యన్ శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ వేరియంట్ కు సబ్ వేరియంట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటిని ఓమిక్రా్న బీఏ4, బీఏ5గా పేర్కొన్నారు.

కోవిడ్ ప్రధాన వేరియంట్ తో వీటిని పోల్చితే చాలా శక్తివంతమైనవని …వేగంగా వ్యాపించే సామర్ధ్యం ఎక్కువని రష్యాలోని రోస్పోట్రెబ్ నడ్జోర్ సెంట్రల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ ఎపిడెమాలజీ హెడ్ కమిల్ ఖఫిజోవ్ తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోని వారిపై ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని వెల్లడించారు. ఇంకా వ్యాక్సిన్లు వేయని దేశాలు అప్రమత్తంగా ఉండాలని అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పష్టం చేసింది.

అయితే ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు మే నెలలో సేకరించిన శాంపిళ్లలో గుర్తించారు. భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ వల్ల థర్ద్ వేవ్ సంభవించిన సంగతి తెలిసిందే. అయితే ఇండియాలోనూ అత్యథిక శాతం ప్రజలు వ్యాక్సిన్లు తీసుకోవడంతో సెకండ్ వేవ్ తో పోల్చితే థర్డ్ వేవ్ ఏమంత ప్రాణనష్టం వాటిల్లలేదు.

Exit mobile version