Site icon HashtagU Telugu

Putin: కోట్ల రూపాయల భవనంలో… ప్రియురాలితో రష్యా అధ్యక్షుడు పుతిన్

Aa187ndj

Aa187ndj

Putin: ప్రపంచంలోనే అతి పెద్ద దేశమైన రష్యాకు పుతిన్ అధ్యక్షుడు. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలరు. మెుండిపట్టు పుతిన్ కు ఎక్కువే. ఏడాది గడుస్తున్నా ఉక్రెయిన్ తో యుద్ధం మాత్రం ముగించటం లేదు. వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నా, పుతిన్ ఎక్కడా తగ్గటం లేదు. పైగా మరిన్ని భీకర చర్యలకు ఒడిగడుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

రష్యా అధ్యక్షుడు పుతిన్ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడని ఎప్పుడూ వార్తలో వినిపిస్తోంది. ఆయన అందుకోసం ఖరీదైన చికిత్స కూడా చేపించుకున్నారని వినికిడి. అంతేకాకుండా లగ్జరీకి పెట్టింది పేరు పుతిన్. తాజాగా ఆయన తన ప్రేయసి అలీనా కబయేవాతో కలిసి కోట్ల రూపాయల భవంతిలో ఉన్నట్లు తెలిసింది. దాదాపు రూ. 990 కోట్లు విలువైన ఎస్టేట్లో రహస్యం గా నివసిస్తున్నట్లు ఇంగ్లీష్ ప్రతిక ఒకటి వెల్లడించింది.

మాస్కోకు 400 కిలోమీటర్ల దూరంలో పుతిన్ ఉన్నట్లు పేర్కొంది. ఈ ఎస్టేట్లో అనేక భవనాలు ఉన్నా యని, వారి ముగ్గురు పిల్లల కోసం ఓ ప్లేగ్రౌండ్ కూడా ఉందని తెలిసింది. ఒలిపింక్స్ లో గోల్డ్ మెడలిస్ట్ అయిన అలీనా కబయేవా.. పుతిన్ ప్రేయసి అంటూ చాలా రోజుల నుంచి గాసిప్స్ వినిపిస్తున్నాయి. వారికి ముగ్గురు పిల్లలని చెప్తారు. ఇక ఈ ఎస్టేట్ వాల్దాయ్ సరస్సుకు దగ్గర్లో ఉంది. .

పుతిన్ అండతో రాజకీయాల్లో అడుగుపెట్టిన అలీనా.. యునైటెడ్ రష్యా పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. ఆరేళ్లపాటు పార్లమెంట్ సభ్యురాలిగానూ వ్యవహరించారు. అయితే పుతిన్ కు సంబంధించిన ఈ వార్త బయటకు పొక్కడంతో.. వైరల్ గా మారింది.

Exit mobile version