Russian Negotiator: రష్యా, ఉక్రెయిన్ ‘శాంతి చర్చలు’ ఓ కొలిక్కి!

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే.

  • Written By:
  • Updated On - March 29, 2022 / 06:58 PM IST

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. యుద్ధం కారణంగా అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ దేశాలు ఎంతగానో నష్టపోయాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు శాంతిచర్చలు జరుపాలని కోరాయి. అయినా తగ్గేదేలే అంటూ రష్యా యుద్ధానికి దిగుతోంది. యుద్ధానికి పుల్ స్టాప్ పడకపోవడంతో రెండు దేశాలు చర్చల ప్రతిపాదనను తెచ్చాయి.

ఈ మేరకు రష్యా, ఉక్రేనియన్ సంధానకర్తలు మంగళవారం ఇస్తాంబుల్‌లో రెండు వారాలకు పైగా ప్రత్యక్ష శాంతి చర్చలు నిర్వహించగా.. రష్యా చీఫ్ సంధానకర్త వ్లాదిమిర్ మెడిన్స్కీ “అర్ధవంతమైన చర్చ” జరిగిందని, ఉక్రేనియన్ ప్రతిపాదనలు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌కు తెలియజేస్తామని చెప్పారు. విలేకరుల సమావేశంలో, మెడిన్స్కీ చర్చల మొదటి రోజు “నిర్మాణాత్మకం” అని ప్రకటించారు. చర్చల సమయంలో, ఉక్రెయిన్ సంధానకర్తలు అంతర్జాతీయ ఒప్పందాన్ని డిమాండ్ చేశారు. దీని ప్రకారం ఇతర దేశాలు ఉక్రెయిన్ భద్రతకు హామీదారులుగా పనిచేస్తాయి.