Russian Devotee: శ్రీవారికి ప్రేమతో.. టీటీడీకి రష్యన్ భక్తుడు 7.6 లక్షల విరాళం!

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న పలు ట్రస్టులకు రష్యన్ భక్తుడు రూ.7.6 లక్షలు విరాళంగా అందించారు.

  • Written By:
  • Updated On - June 2, 2023 / 03:13 PM IST

కలియుగ దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామికి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ భక్తులున్నాయి. ప్రతి ఏడాది స్వామివారిని దర్శించుకుంటూ మొక్కులు చెల్లిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఓ రష్యన్ భక్తుడు భారీగా విరాళం అందజేశాడు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న పలు ట్రస్టులకు అచ్యుత మాధవ దాస్ అనే రష్యన్ భక్తుడు రూ.7.6 లక్షలు విరాళంగా అందించారు. మాధవ్ దాస్ టీటీడీ కార్యనిర్వహణాధికారి, ఎ.వి.ధర్మారెడ్డికి, స్నేహితుడితో కలిసి చందా చెక్కులను అందజేశారు.

ఈ విరాళంలో SVBC ట్రస్ట్‌కు(1.64 లక్షల రూపాయలు, అలాగే ఎస్‌వి అన్నప్రసాదం, గోసంరక్షణ, ప్రాణదాన, విద్యాదాన, వేదపారాయణ ట్రస్ట్, బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని మిగతా విరాళం డబ్బును ఖర్చు పెట్టనున్నారు. ఇక తిరుమల ఘాట్‌ రోడ్డులో వరుస ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని తిరుపతి ట్రాఫిక్‌ విభాగం కొత్త చర్యలు చేపట్టింది. అలాగే, తాజా అప్‌డేట్ ప్రకారం.. టోకెన్లు లేని భక్తులు సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టవచ్చు. జూన్ 4న తిరుమల ఆలయంలో జ్యేష్ఠాభిషేకం జరగనుంది. జ్యేష్ఠాభిషేకం దృష్ట్యా ఆదివారం ఆర్జిత సేవను రద్దు చేస్తున్నట్లు  గమనించాలని టీటీడీ అధికారులు కోరారు.

Also Read: Peda Kapu: పొలిటికల్ ఎలిమెంట్స్ తో ‘పెద కాపు-1’.. ఆసక్తి రేపుతున్న ఫస్ట్ లుక్!