Russia Moon Mission : చంద్రయాన్-3కి పోటీగా రష్యా “లునా – 25”.. చంద్రయాన్-3 కంటే ముందే చంద్రుడిపైకి చేరేలా ప్లాన్

Russia Moon Mission  :  అగ్ర రాజ్యం రష్యా మళ్లీ చంద్రుడిపై ఫోకస్ పెట్టింది.. చివరిసారిగా 1976లో చంద్రుడిపైకి  లూనార్‌ ల్యాండర్‌ ను ప్రయోగించిన  రష్యా ఇప్పుడు మరోసారి ఆ దిశగా అడుగులు వేసింది. 

  • Written By:
  • Publish Date - August 11, 2023 / 09:47 AM IST

Russia Moon Mission  :  అగ్ర రాజ్యం రష్యా మళ్లీ చంద్రుడిపై ఫోకస్ పెట్టింది.. 

చివరిసారిగా 1976లో చంద్రుడిపైకి  లూనార్‌ ల్యాండర్‌ ను ప్రయోగించిన  రష్యా ఇప్పుడు మరోసారి ఆ దిశగా అడుగులు వేసింది. 

50 ఏళ్ల  గ్యాప్ తర్వాత మళ్లీ చందమామపైకి “లునా – 25”  పేరుతో స్పేస్ క్రాఫ్ట్ ను ప్రయోగించింది.

ఈవిషయాన్ని రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ “రోస్‌ కాస్మోస్‌” వెల్లడించింది. 

ప్రయోగానికి సంబంధించిన ఫోటోలను కూడా రిలీజ్ చేసింది. 

Also read :  WhatsApp Multi Account : వాట్సాప్ లో మల్టీ అకౌంట్ ఫీచర్‌.. ఒక ఫోన్ లో ఎన్ని అకౌంట్లయినా లాగిన్ కావచ్చు

రాజధాని మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ ప్రాంతం నుంచి శుక్రవారం వేకువజామున 2.10 గంటలకు  “లునా – 25”  నింగిలోకి దూసుకెళ్లిందని “రోస్‌ కాస్మోస్‌” తెలిపింది. కేవలం ఐదు రోజుల్లోనే ఇది చంద్రుడి కక్ష్యలోకి చేరుతుందని పేర్కొంది.   భారత్ ఇటీవల  ప్రయోగించిన చంద్రయాన్ 3 ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కానుంది. ఇక రష్యా “లునా – 25”   ల్యాండర్ కూడా చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కానుంది.   మన చంద్రయాన్-3 ల్యాండర్  చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న ల్యాండ్ కానుండగా.. అంతకంటే ముందే రష్యా పంపిన లూనా-25 అక్కడ అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు, అక్కడి ఖనిజ వనరుల జాడను గుర్తించడమే లక్ష్యంగా “లునా – 25”  ప్రయోగం చేశామని రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ “రోస్‌ కాస్మోస్‌” తెలిపింది.