Site icon HashtagU Telugu

Russia Private Army Explained : పుతిన్ చెఫ్ పెట్టిన ప్రైవేటు సైన్యం..అసలు కథ

Russians

Russia Vs Wagner Group1

Russia Private Army Explained : రష్యా అధ్యక్షుడు పుతిన్ పై తిరగబడిన కిరాయి సైన్యం.. వాగ్నెర్ గ్రూప్ కథేంటి ?   

పుతిన్ పై పోరాడుతూ చస్తాను.. అని అంటున్న వాగ్నెర్ గ్రూప్ అధిపతి యవ్జెనీ ప్రిగోజిన్ ఎవరు ? 

యవ్జెనీ ప్రిగోజిన్ ఒకప్పుడు రెస్టారెంట్ నడిపేవాడు

రష్యా సైనిక నాయకత్వాన్ని పడగొట్టడానికి అవసరమైన అన్ని దారుల్లో వెళ్తానని వాగ్నెర్ గ్రూప్ (wagner) అధిపతి యవ్జెనీ ప్రిగోజిన్ ప్రతిజ్ఞ చేశాడు. ఈనేపథ్యంలో అతడు ఎవరు ? అతడి నేపథ్యం ఏమిటి ?  అనేది ఆసక్తికరంగా మారింది. ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. యవ్జెనీ ప్రిగోజిన్ ఒకప్పుడు రెస్టారెంట్ నడిపేవాడు. పుతిన్‌కి అతడి రెస్టారెంట్‌లోని ఫుడ్‌ బాగా నచ్చడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పుతిన్‌తో సన్నిహితంగా ఉండటం వల్ల అతని వ్యాపారం చాలా లాభపడింది. రష్యా గవర్నమెంట్ నుంచి యవ్జెనీ ప్రిగోజిన్ కంపెనీకి  భారీగా క్యాటరింగ్ కాంట్రాక్టులు వచ్చాయి. అందుకే ప్రజలు అతన్ని పుతిన్ చెఫ్(Russia Private Army Explained) అని పిలుస్తుంటారు.

పుతిన్ సపోర్ట్ తో అతడు 2014 మే లో.. 

ఈక్రమంలోనే  పుతిన్ సపోర్ట్ తో 2014 మే లో వాగ్నెర్ గ్రూప్ ను యవ్జెనీ ప్రిగోజిన్ స్టార్ట్ చేశాడు. రష్యా ఆర్మీ కోసం ఒక ప్రత్యేక పారా మిలిటరీ విభాగాన్ని తయారు చేసి ఇవ్వడమే దాని పని. అందుకు ఖర్చయ్యే బడ్జెట్ ను రష్యా రక్షణ శాఖ నుంచి పుతిన్ మంజూరు చేసేవారు.  వాగ్నెర్ గ్రూప్ (wagner)కు చెందిన కిరాయి సైన్యం తయారైన మొదటి ఏడాదిలోనే(2014)..  దాన్ని రష్యా ఆర్మీతో కలిపి ఉక్రెయిన్ లోని  డాన్ బాస్ రీజియన్,  క్రిమియాలపై దాడికి పుతిన్ పంపారు. ఇటీవల ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాలను రష్యా ఆక్రమించుకోవడంలో కూడా వాగ్నెర్ గ్రూప్ దళాలు కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుతం వాగ్నర్ గ్రూప్‌కు చెందిన దాదాపు 50,000 మంది సైనికులు ఉక్రెయిన్‌లో యుద్ధం చేస్తున్నారు.

Also read : Russia Vs Wagner Group : రష్యాలో సైనిక తిరుగుబాటు ? తిరగబడిన కిరాయి సైన్యం వాగ్నెర్ గ్రూప్

వాగ్నెర్ గ్రూప్ అంటే ఏమిటి ?

వాగ్నెర్ గ్రూప్‌ అనేది ఒక ప్రైవేట్ ఆర్మీ. దీన్ని రష్యా ఆర్మీలోని ఒక ప్రైవేట్ పారా మిలిటరీ దళంగా పరిగణిస్తున్నారు. వాగ్నెర్ గ్రూప్ ఎక్కడ యుద్ధానికి వెళ్లినా.. మానవ హక్కులను ఉల్లంఘించిందని చాలాసార్లు ఆరోపణలు వచ్చాయి. “వాళ్ళు క్రూరులు. వారికి కనికరం లేదు” అని గతంలో చాలాసార్లు వాగ్నెర్ గ్రూప్ ను ఉద్దేశించి అమెరికా పేర్కొంది. 2014లో ఉక్రెయిన్ లోని క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకోవడంతో వాగ్నెర్ గ్రూప్ పేరు మొదటిసారిగా తెరపైకి వచ్చింది. వాగ్నెర్ గ్రూప్ సాయంతోనే క్రిమియాను రష్యా కంట్రోల్ లోకి తెచ్చుకుందనే డిస్కషన్ అప్పట్లో నడిచింది.

వాగ్నెర్ గ్రూప్.. హిట్లర్ తో లింక్  

వాగ్నెర్ గ్రూప్‌ వ్యవస్థాపకుల్లో దిమిత్రి ఉత్కిన్ కీలకమైన వ్యక్తి. ఉక్రెయిన్ లో పుట్టిన ఆయన 2013 వరకు రష్యా ఆర్మీలో పనిచేశారు. పదవీ విరమణ చేసిన తర్వాత  అతడు స్లావోనిక్ కార్ప్స్‌లో చేరాడు. 2013లో అంతర్యుద్ధం సమయంలో సిరియన్ అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ పక్షాన పోరాడాడు.  2013 అక్టోబర్ లో మాస్కోకు తిరిగి వచ్చాడు. ఈ టైంలో వాగ్నెర్ గ్రూప్‌ ఏర్పాటుకు రెడీ అవుతున్న యవ్జెనీ ప్రిగోజిన్  పరిచయమయ్యాడు. ఈ ఇద్దరు కలిసి పుతిన్ సపోర్ట్ తో వాగ్నెర్ గ్రూప్‌ ను ప్రారంభించారు. దిమిత్రి ఉత్కిన్..  అడాల్ఫ్ హిట్లర్‌ను తన ఆదర్శంగా భావిస్తాడు. జర్మనీకి చెందిన సంగీతకారుడు రిచర్డ్ వాగ్నెర్ అంటే హిట్లర్ కు చాలా ఇష్టం. దిమిత్రి ఉత్కిన్ సూచన మేరకే రష్యా కిరాయి సైన్యానికి వాగ్నెర్ అనే పేరు పెట్టేందుకు యవ్జెనీ ప్రిగోజిన్  అంగీకరించాడని అంటారు.