Site icon HashtagU Telugu

Ukrain: ఉక్రెయిన్ పై రాత్రి వేళలో రష్యా దాడులు.. ధ్వంసమైన ఓడరేవు మౌలికా సదుపాయాలు?

Ukrain

Ukrain

ఉక్రెయిన్‌ పై రష్యా దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్‌ వాసులు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గ్యాప్ లేకుండా ఉక్రెయిన్ దేశం పై రష్యా దాడులు జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే రష్యా ఇప్పటివరకు ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక ఎత్తు అన్నట్టుగా ఉక్రెయిన్‌ పై రష్యా క్షిపణులు, డ్రోన్ ల సహాయంతో రాత్రి వేళల్లో విరుచుకుపడుతోంది. వీటిని ఉక్రెయిన్‌ తిప్పికొడుతోంది. రష్యా తాజాగా జరిపిన దాడుల్లో దక్షిణ ఉక్రెయిన్‌ లోని ఒడెసా నగరంలో ఉన్న నౌకాశ్రయ కీలక మౌలిక సదుపాయాలు ధ్వంసం అయ్యాయి.

రాత్రి సమయంలో ఒక్కసారిగా డ్రోన్ ల సహాయంతో దాడి చేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వాటిలో ఉన్న ధాన్యం, చమురు ఎగుమతి టెర్మినళ్లు కూడా ఉన్నాయి. ఈ దాడులతో 12 మంది పౌరులు గాయపడ్డారని ఉక్రెయిన్‌ అధికారులు బుధవారం వెల్లడించారు. ఉక్రెయిన్‌ ఓడరేవు నగరం ఒడెసాపై వరుసగా రెండో రోజూ దాడులకు పాల్పడడం గమనార్హం. అలాగే కీవ్‌పై ఇరాన్‌ తయారీ షాహిద్‌ డ్రోన్ లతో రష్యా చేసిన దాడిని అక్కడి గగనతల రక్షణ వ్యవస్థ నిలువరించింది.

కాగా మరోవైపు సైనిక స్థావరంలో మంటలు చెలరేగడంతో ముందుజాగ్రత్త చర్యగా క్రిమియాలోని నాలుగు గ్రామాల నుంచి 2,200 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు రష్యా అత్యవసర విభాగ అధికారులు వెల్లడించారు. అయితే కిరోవ్‌స్కీ జిల్లాలో రేగిన ఆ అగ్నికీలలకు కారణమేమిటన్నది ఇంకా తెలియరాలేదు.

Exit mobile version