Russia: రష్యా గ్యాసోలిన్ ఎగుమతులపై ఆరు నెలల నిషేధాన్ని విధించింది. ఈ నిషేధాన్ని మార్చి 1 నుండి ప్రవేశపెడుతుందని రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ ప్రతినిధి మంగళవారం తెలిపారు.
రష్యా గ్యాసోలిన్ ఎగుమతులపై ఆరు నెలల నిషేధాన్ని మార్చి 1 నుంచి ప్రవేశపెట్టనుందని రష్యా డిప్యూటీ ప్రధాని అలెగ్జాండర్ నోవాక్ ప్రతినిధి తెలిపారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. వసంత మరియు వేసవిలో డిమాండ్ పెరుగుదలను భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అలాగే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో డీజిల్ అమ్మకాల రేటును 16 శాతానికి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
అయితే యురేషియన్ ఎకనామిక్ యూనియన్‌లోని దేశాలకు ఈ పరిమితి వర్తించదని నివేదిక పేర్కొంది. గతంలో దేశీయ మోటార్ ఇంధన మార్కెట్‌లో ధరల పరిస్థితిని స్థిరీకరించడానికి రష్యా 2023లో సెప్టెంబర్ 21 నుండి నవంబర్ 17 వరకు గ్యాసోలిన్ ఎగుమతులపై నిషేధాన్ని ప్రవేశపెట్టింది. దేశీయ ఇంధన సరఫరా మిగులు ఏర్పడిన తర్వాత నిషేధం ఎత్తివేసింది.
Also Read: Municipal Commissioners: ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీలు