రష్యా, ఉక్రెయిన్ మధ్య వార్ నేధ్యంలో భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఏడో రోజు కూడా రష్యా, ఉక్రెయిన్ పై తన దాడులను తీవ్రతరం చేసింది. ఇక ఉక్రెయిన్‌లో రష్యా దండయాత్ర కొనసాగిస్తున్న నేపధ్యంలో, రష్యా సైనిక దళాల ఎటాక్స్‌తో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై పూర్తి పట్టు కోసం రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రష్యన్ బలగాలు కీవ్‌ను చుట్టుముడుతున్నాయని వార్తలు వస్తున్నాయి.
ఈ నేపధ్యంలో సుమారు 64 కిలోమీటర్ల పొడవైన యుద్ధ ట్యాంకుల కాన్వాయ్ కీవ్‌లోకి ఎంటరైందని ఇంటర్ నేషనల్ మీడియా పేర్కొంది. ఇక ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను చుట్టుముట్టిన రష్యన్ బలగాలు, అక్కడ సైనిక స్థావరాలతో పాటు జనావాస ప్రాంతాల్లో కూడా బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. అంతే కాకుండా అక్కడ రష్యన్ దళాలు మిస్సైల్స్, ఫిరంగులతో ఎటాక్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 56 రాకెట్లు, 113 క్షిపణులను రష్యా సైన్యం ప్రయోగించిందని తెలుస్తోంది.