Russia-Ukraine: ర‌ష్యా కీల‌క నిర్ణ‌యం.. ఉక్రెయిన్‌లో యుద్ధం ఆగింది..!

  • Written By:
  • Updated On - March 5, 2022 / 01:16 PM IST

ఉక్రెయిన్ పై ర‌ష్యా దండ‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ప్ర‌పంచ‌దేశాల వ‌త్తిడితో ర‌ష్యా ఈరోజు కీల‌క నిర్ణ‌యం తీస‌కుంది. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్‌లో ఐదు గంటల పాటు కాల్పుల విరమణ పాటిస్తామని రష్యా ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా ఈరోజు ఉదయం 11.30 గంట‌ల నుంచి ర‌ష్యా సైనిక ద‌ళ‌ కాల్పులను ఆపేసింది. విరామం లేకుండా బాంబు దాడులు జ‌రుగుతున్న క్ర‌మంలో ఉక్రెయిన్‌లో ఉన్న వివిధ దేశాలకు చెందిన ప్రజలును, తరలించడం ఆ దేశాలకు సాధ్యం కావడం లేదు.

ఈ నేప‌ధ్యంలో ఉక్రెయిన్‌లో ఉన్న విదేశీయులను తరలించేందుకు ఈ విరామం ఇచ్చింది రష్యా. ఈ మేరకు విదేశీయుల తరలింపునకు సహకరిస్తామని యూఎన్‌హెచ్‌ఆర్సీకి రష్యా తెలిపింది. మరోవైపు ప్రపంచ దేశాల ఒత్తిడితోనే రష్యా ఈ యుద్ధ విరామ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇతర దేశాల ప్రజలు సులువుగా సరిహద్దు ప్రాంతాలకు చేరుకునే అవకాశముంటుంది. అందుకే వివిధ దేశాల ప్రజలు యుద్ధం బారిన పడకుండా విరామాన్ని ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి, మానవహక్కుల కమిషన్‌కు చెప్పినట్లే రష్యా యుద్ధాన్ని స్వల్ప కాలం విరమిస్తున్నట్లు ప్రకటించింది. ఇక మ‌రోవైపు ఇండియాకు చెందిన రెండు వేల మంది ఇంకా ఉక్రెయిన్ లోనే చిక్కుకుపోయి ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.