Site icon HashtagU Telugu

Defense Minister Missing : చైనా రక్షణమంత్రి మిస్సింగ్ .. ఏమయ్యారు ?

Defense Minister Missing

Defense Minister Missing

Defense Minister Missing :  చైనా ప్రభుత్వంలోని కీలక మంత్రులు ఒకరి తర్వాత ఒకరుగా మిస్సింగ్ కావడం కలకలం రేపుతోంది. గతంలో చైనా విదేశాంగ మంత్రిగా పనిచేసిన క్విన్ గ్యాంగ్  దాదాపు నెల రోజుల పాటు మిస్సవడంతో కలకలం రేగింది. హాంకాంగ్ కు చెందిన ప్రముఖ మహిళా జర్నలిస్టుతో అఫైర్ ఉండటంతో ఆయనను అదుపులోకి తీసుకొని చైనా ఆర్మీ ఇంటరాగేట్ చేసిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ తర్వాత విదేశాంగ మంత్రిగా మరో కొత్త వ్యక్తిని నియమించారు. ఇప్పుడు ఇదే సీన్ చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు  విషయంలోనూ రిపీట్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత 12 రోజులుగా చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు కనిపించడం లేదని పేర్కొంటూ జపాన్‌లోని అమెరికా రాయబారి రహ్మ్ ఇమాన్యుయేల్ ట్వీట్ చేయడంతో ఈవిషయం వెలుగులోకి వచ్చింది. చైనా రక్షణమంత్రి ఎందుకు మిస్సయ్యారు ? ఆయనపై వచ్చిన ఆరోపణలు ఏమిటి ? ఆయన ఇప్పుడు జైలులో ఉన్నారా ? అనేది ఇంకా తెలియరావడం లేదు.

Also read : CBN Lawyer Comments : బెంగాల్ మంత్రులకు హౌస్ రిమాండ్ ఇచ్చారు.. చంద్రబాబుకూ ఇవ్వాలి : లూథ్రా 

ఈనేపథ్యంలో చైనా అధ్యక్షుడు  షి జిన్‌పింగ్ ఇటీవల దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న సైనిక స్థావరాలను స్వయంగా సందర్శించారు. ఆయన వెంట రక్షణ మంత్రి లేరు.  ఐక్యత, స్థిరత్వం సూత్రాలతో సైన్యం ముందుకు సాగాలని ఈసందర్భంగా షి జిన్‌పింగ్ (Defense Minister Missing) పిలుపునిచ్చారు. సైనిక అంశాలపై స్వయంగా చైనా అధ్యక్షుడు సమీక్షించడం .. రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు  కనిపించకుండా  పోవడం అనేది పలు అనుమానాలకు తావిస్తోంది. చైనాలో మీడియా స్వేచ్ఛ లేకపోవడంతో.. అక్కడ జరిగే ఇలాంటి కీలక పరిణామాలపై త్వరగా ప్రపంచానికి తెలియడం లేదు. రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫు చివరిసారిగా ఆగస్ట్ 29న బీజింగ్‌లో జరిగిన 3వ చైనా-ఆఫ్రికా శాంతి మరియు భద్రతా ఫోరమ్‌ సమావేశంలో ప్రసంగం చేస్తూ కనిపించారు. ఆయన మీడియా ముందు కనిపిించడం అదే లాస్ట్ . ఆయన మిస్సింగ్ పై చైనా ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇస్తుందో వేచిచూడాలి.