Dalit Bandhu: ‘దళిత బంధు’లో బంధు ప్రీతి!

దళితుల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...దళిత బంధు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ పథకం కింద ఒక్కో నిరుపేద ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రూ.

  • Written By:
  • Updated On - April 2, 2022 / 03:19 PM IST

దళితుల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…దళిత బంధు పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ పథకం కింద ఒక్కో నిరుపేద ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రూ. పది లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పథకంలో టీఆరెస్ పార్టీ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య సోదరుడు..లబ్దిదారుల ఎంపికలో ఉండటంతో తీవ్ర విమర్శలకు కారణం అయ్యింది. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై పెద్దెత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే కొన్ని ప్రాంతాల్లో దళిత బంధు పథకం వల్ల టీఆరెస్ కార్యకర్తలకే మేలు జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై పెద్దెత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి కారణం రాజయ్య తన సోదురుడు సురేష్ కు దళిత బంధు పథకాన్ని ఎంపిక చేయడం. సురేష్ ప్రస్తుతం స్టేషన్ ఘన్ పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఉన్నారు. రాజయ్య తమ్ముడితోపాటు ఒకరిద్దరు స్థానిక ప్రజాప్రతినిధుల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

దీంతో ఎమ్మెల్యే రాజయ్యపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. దళిత బంధు ద్వారా అధికార పార్టీ నేతలకు మాత్రమే లబ్ది చేకూర్చు ప్రయత్నం జరుగుతుందని ఆరోపణలు చేస్తున్నారు. ప్రతిపక్షాల ఆరోపణలను అధికార పక్షం తోసిపుచ్చింది. పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో భాగమని పేర్కొంది. దళిత బంధులో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ద్రుష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని సీనియర్ నేత తెలిపారు. దళిత బంధు పథకంలో టీఆరెస్ నాయకులు లబ్ది పొందుతున్నారన్న ఆరోపణలను ఆయన ఖండించారు.