హిందూ మతంలో భగవంతున్ని ఆరాధించాలంటే దీపంతో లేకుండా పూజలు నిర్వహించలేం. దీపం వెలిగించకుండా ఏ దేవతకు పూజలు చేయలేరు. కొంతమంది ఇంట్లో ఉదయం , సాయంత్రం పూజ సమయంలో దీపం వెలిగించి భగవంతుని ప్రసన్నం చేసుకుని ఆయన అనుగ్రహం పొందుతుంటారు.
ఇలా చేస్తే దేవతలు సంతోషించడమే కాకుండా ఇంట్లో సానుకూల శక్తి , ఇంటి సభ్యుల మనస్సులో శాంతి కూడా ఉంటుంది. మత విశ్వాసాల ప్రకారం, దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయని మీకు తెలుసా? అవి తప్పనిసరిగా పాటించాలి. దీపాలు వెలిగించడానికి సంబంధించిన నిబంధనల గురించి తెలుసుకుందాం.
దీపం ఎక్కడ ఉంచాలి
పూజ చేసినప్పుడల్లా దేవుడి ముందు నెయ్యి లేదా నూనెతో దీపం వెలిగిస్తాం. పూజ చేసేటప్పుడు మనం నెయ్యి దీపం వెలిగిస్తున్నట్లయితే, దానిని దేవుని ముందు ఎడమ వైపున ఉంచి, నెయ్యి దీపంలో ఎల్లప్పుడూ దూదిని ఉపయోగించాలని గుర్తుంచుకోండి. మరోవైపు, మనం నూనె దీపాన్ని వెలిగిస్తున్నట్లయితే, అది ఎల్లప్పుడూ దేవుని ముందు మన కుడి వైపున ఉంచాలి. నూనె దీపం వెలిగించేటప్పుడు ఎర్రటి దారాన్ని ఉపయోగించడం మంచిదని పండితులు చెబుతున్నారు.
దీపం వెలిగించడానికి సరైన సమయం, సరైన దిశ
సరైన పూజా సమయం ఉదయం 5 నుండి 10 గంటల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. దీపారాధన ఎంత త్వరగా చేస్తే అంత మంచిది. ఎందుకంటే మనిషి ఏకాగ్రతతో పూజించగలిగే సమయం ఇదే కాబాట్టి. సాయంత్రం 5 నుండి 7 గంటల మధ్య పూజ చేయడం ఉత్తమమైనదిగా భావించాలి. ఇది కాకుండా, దీపం ఉంచే శుభ దిక్కు తూర్పు లేదా ఉత్తరంగా పరిగణించబడుతుంది. పడమర దిశలో దీపం పెట్టడం వల్ల అనవసరమైన ధనం వృధా అవుతుంది. అయితే దక్షిణ దిశలో పూర్వీకులకు దీపం వెలిగిస్తారు.
విరిగిన దీపాన్ని ఉపయోగించవద్దు
మట్టి దీపం వెలిగించేటప్పుడు, అది పగలకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. లోహ దీపంలో నెయ్యి లేదా నూనె వేసి దేవుని ముందు వెలిగించండి. దీపం వెలుగుతున్నప్పుడు …అది ఆరిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
Videos For You