Site icon HashtagU Telugu

AP Govt: ఆర్టీపీసీఆర్‌ టెస్టు ధర రూ.350

Covid Tests

Covid Tests

రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నయ్.. దాంతోపాటే టెస్టుల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే ఇదే అవకాశంగా మలుచుకున్న కొన్ని ప్రైవేట్ ల్యాబ్స్ ఇష్టానుసరంగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఆర్టీపీసీఆర్ ధరలను సవరించింది. రాష్ట్రంలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్ష ఆర్టీపీసీఆర్‌ రేటును సవరిస్తూ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీచేసింది. ఐసీఎంఆర్‌ గుర్తింపు కలిగిన ఎన్‌ఏబీఎల్‌ ప్రైవేటు ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్‌ ధరను రూ.350గా నిర్ణయించింది. ఆస్పత్రులు, ల్యాబ్‌లలో కచ్చితంగా సవరించిన రేట్లను ప్రదర్శించాలని ఆదేశించింది. జిల్లా వైద్యాధికారులు సవరించిన రేట్లకే పరీక్షలు జరిగేలా నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం పంపే శాంపిళ్ల టెస్టుకు రూ.475, అలాగే ఎన్‌ఏబీఎల్‌ ల్యాబ్‌లలో రూ.499 వసూలుచేస్తున్నారు.