తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ఘోర ప్రమాదం తప్పింది. సజ్జనార్ కారు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటన పెద్దపెల్లిలో చోటుచేసుకుంది. పాలకుర్తి మండలం ధర్మారం క్రాస్ రోడ్డు దగ్గర రాత్రి ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. సజ్జనార్ కు గాయాలు అయ్యాయి. మహారాష్ట్రకు వెళ్తుండగా ధర్మారం క్రాస్ రోడ్డు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. సజ్జనార్ కుడి చేతికి గాయమైంది. ప్రస్తుతం ఆయన పరిస్ధితి బాగానే ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
TS RTC MD : ఆటోను ఢీకొన్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కారు..!!

TSRTC MD Sajjanar