Site icon HashtagU Telugu

TSRTC : హైద‌రాబాద్‌లో ఆర్టీసీ బ‌స్సు చోరీ.. కేసు న‌మోదు చేసిన పోలీసులు

Tsrtc Buses Imresizer

Tsrtc Buses Imresizer

హైద‌రాబాద్‌లో డిపో ముందు పార్క్ చేసిన ఆర్టీసీ బ‌స్సు చోరీకి గురైంది. సోమవారం రాత్రి నగరంలోని మెహదీపట్నం బస్ డిపో ముందు ఆగి ఉన్న టిఎస్‌ఆర్‌టిసి బస్సును గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. రాష్ట్ర రవాణా సంస్థలో పనిచేస్తున్న ఒక బస్సు డ్రైవర్ సోమవారం రాత్రి సుమారు 10.30 గంటలకు మెహిదీపట్నం బస్ డిపో ముందు వాహనాన్ని పార్క్ చేసి ఇంటికి వెళ్లాడు. ఉదయం తిరిగి వచ్చేసరికి బస్సు పోయిందని డ్రైవర్‌ గుర్తించాడు. చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో తనిఖీలుచేశారు. డిపోలో కూడా త‌నిఖీలు చేసిన త‌రువాత క‌నిపించ‌క‌పోవ‌డంతో బ‌స్సు డ్రైవ‌ర్ ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్ఆయ‌దు చేశారు . పోలీసులు కేసు నమోదు చేసి మెహిదీపట్నం పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాలను పరిశీలించారు. విచారణ అనంతరం తుండపల్లి, శంషాబాద్‌లో బస్సును పోలీసులు గుర్తించారు.