RS Praveen: ప్రజాపాలన కాదు.. ప్రతీకార పాలన.. కాంగ్రెస్ పై ఆర్ఎస్ పంచులు

  • Written By:
  • Updated On - April 7, 2024 / 11:27 PM IST

RS Praveen : రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన పేరుతో ప్రతీకార పాలన సాగిస్తున్నారని భారత రాష్ట్ర సమితి నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్ధి డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఆదివారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన పార్టీ సభకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తుక్కుగూడ వేదికగా ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇచ్చి,ప్రజలను మోసం చేసిందన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా గారడీల పాలన సాగిస్తున్నారని విమర్శించారు.

కరీంనగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో భారాస నేతలపై పోలీసులపై అక్రమ కేసులు పెట్టి, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. నాయకులు, కార్యకర్తలు అక్రమ కేసులకు భయపడకుండా దైర్యంగా ఎదుర్కొని దోపిడీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించాలన్నారు.రాబోయే పార్లమెంటు ఎన్నికలు వంద రోజుల అబద్దాల కాంగ్రెస్ ప్రభుత్వం,పదేళ్ల నిజమైన పాలన అందించిన భారాసల మధ్య జరుగుతున్నాయన్నారు.రాష్ట్రం కరువు ఏర్పడి పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాల ల పేరుతో గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే కుట్రలు చేస్తుంది తప్ప, ప్రజల సమస్యలు పరిష్కరించడంలేదని విమర్శించారు.

మళ్లీ కేంద్రంలో మూడోసారి భాజపా అధికారంలోకి వస్తే, రాజ్యాంగాన్ని రద్దు చేసి,మనుస్మృతి ఆధారంగా అలహాబాద్ లో కొంతమంది హిందుత్వవాదులు రాసిన హిందుత్వ రాజ్యాంగాన్ని అమలు చేస్తారని తెలిపారు. రాజ్యాంగం రద్దయితే హక్కులు కొలోతామని అన్నారు. రాజ్యాన్ని రక్షించుకునేందుకు పార్లమెంట్ ఎన్నికల్లో భారాసను గెలిపించాలన్నారు. జెండా మారినా అజెండా పేద ప్రజల పక్షమేనమి తెలిపారు. మసీదులు తవ్వే నాయకులు కావాలో, ప్రజా సమస్యలపై పార్లమెంటులో గళమెత్తే నాయకులను గెలిపించాలో ఓటర్లు తేల్చుకోవాలన్నారు.కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్ధి బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.