Site icon HashtagU Telugu

Gurukula Bata : ఒక మాతృమూర్తిగా “కుట్ర” జరిగిందని మీరు మాట్లాడాల్సిన మాటలేనా?: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

RS Praveen Kumar comments on minister konda surekha

RS Praveen Kumar comments on minister konda surekha

Rs Praveen Kumar : బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గురుకుల బాట పై మాట్లాడుతూ..గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గురుకుల బాట అనే కార్యక్రమం చేపట్టారని అన్నారు. గురుకుల బాట అని చెప్పగానే కాంగ్రెస్‌కు భయం పుట్టిందన్నారు. మంత్రి కొండా సురేఖ శుక్రవారం నాపై ఆరోపణలు చేశారు. నేను విద్యార్థులకు కలుషిత ఆహారం పెడుతున్నానని చెప్పారు. తెలంగాణ ప్రజలు గతంలోనే కొండా సురేఖను తిరస్కరించారని అన్నారు. మహిళలపై ఆమె చేసిన ఆరోపణలకు కేసు పెట్టాలని కోర్టు చెప్పింది. ఆమెకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదన్నారు.

బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీల గురించి వీడియోలు చేసే మీకు..విషాహారం తిని తల్లడిల్లుతున్న విద్యార్థుల బాధ మీకు అర్థమవుతుందా? అని ప్రశ్నించారు. ఒక మాతృమూర్తిగా ‘కుట్ర’ జరిగిందని మీరు మాట్లాడాల్సిన మాటలేనా? అని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గతంలో ఐపీఎస్‌ అధికారిగా ఉన్న నాకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. ఏడేళ్ల సర్వీస్‌ను వదిలేసి విద్యార్థుల కోసం రాజకీయాల్లోకి వచ్చాను. నాపై ఆరోపణలు ఉంటే బైటపెట్టాలని ఆర్‌ఎస్పీ సవాల్‌ విసిరారు. వాటికి ఆధారాలు ఉంటే సీబీఐ విచారణకు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మీరు భవిష్యత్ లో తెలంగాణ లో మాట్లాడ కండి అంటూ హెచ్చరించారు. మీరు మాట్లాడిన మాటలు వినలేక తెలంగాణలో మహిళలు తల దించు కుంటున్నారని చురకలు అంటించారు. కొండా సురేఖ స్థాయి కి నేను దిగజారదల్చుకోలేదన్నారు. కోర్టు కూడా కొండా సురేఖ భాష వినలేక పోయింది. మీకు మంత్రి పదవి లో ఉండే అర్హత లేదని తేల్చి చెప్పారు. నా గురించి మాట్లాడే హక్కు కూడా మీకు లేదని తెలిపారు.

Read Also: Keerthy Suresh : కల్కి లో కీర్తి రిజెక్ట్ చేసిన పాత్ర ఏది..?