కేసీఆర్ ఫామ్ హౌస్‌లో యువకుడు మరణించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. యువకుడి మరణంతో ప్రభుత్వం పై అటు కుటుంబ సభ్యులు, ఇటు ప్రతి పక్షాలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలో బిఎస్పి నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లోని యువకుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని వెంటనే యువకుడి అనుమానాస్పద మృతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫామ్ హౌస్ ఓనర్ పై 304(A) ఐపీసీ కింద కేసు నమోదు చేయాలని కోరారు. అలాగే అది హత్యా లేక లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేపట్టాలన్నారు. సీఆర్ పీసీ నమోదు చేస్తే సరిపోదని పోలీసులపై ఫైర్ అయ్యారు.
ముఖ్యమంత్రి KCR గారి ఫాం హౌస్ లో యువకుడి అనుమానాస్పద మృతిపై తక్షణమే CBI విచారణ జరిపించాలి. దీనిపై ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఒక ప్రకటన చేయాలి. పోలీసులు కేవలం 174 Cr PC కేసు నమోదు చేస్తేనే సరిపోదు, ఫాంహౌస్ ఓనరు పై మొదట 304(A) IPC కింద కూడా కేసు నమోదు చేయాలి. pic.twitter.com/JAghjnkUp3
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) December 23, 2021
