Site icon HashtagU Telugu

Hyderabad : మైన‌ర్ బాలిక‌పై “బీఆర్ఎస్” నేత వేధింపులు

Minor Girl

Minor Girl

మైనర్ బాలికను వేధిస్తున్న ఆరోపణలపై గోషామహల్ నియోజకవర్గానికి చెందిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నేత మహ్మద్ అకీల్ అహ్మద్‌ను బేగంబజార్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాధితురాలు 10 ఏళ్ల బాలిక ఫీల్ఖానాలోని ఓ మెడికల్ షాపుకు వెళ్లిందని… అక్కడే ఉన్న అకీల్ అహ్మద్ బాలిక చేయి పట్టుకుని ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. దీంతో భయపడిన చిన్నారి అతడి బారి నుంచి తప్పించుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపింది. ఈ ఘ‌ట‌న‌పై బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అఖీల్ అహ్మద్‌ను సెక్షన్ 354 ఐపీసీ కింద అరెస్టు చేశారు, అలాగే పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. మహ్మద్ అఖీల్ అహ్మద్ ని పార్టీ నుంచి స‌స్పెండ్ చేశామ‌ని మాజీ ఎమ్మెల్యే, గోషామహల్ ఇన్‌ఛార్జ్ ప్రేమ్ సింగ్ రాథోడ్ తెలిపారు.