Site icon HashtagU Telugu

National Flag At New Parliament: కొత్త పార్లమెంట్ భవనం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాజ్యసభ చైర్మన్.. వీడియో..!

National Flag At New Parliament

Compressjpeg.online 1280x720 Image (3) 11zon

National Flag At New Parliament: సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందు ఆదివారం ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్ కొత్త పార్లమెంట్ భవనంలో త్రివర్ణ పతాకాన్ని (National Flag At New Parliament) ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు. ఈరోజు ప్రధాని మోదీ పుట్టినరోజు కావడం విశేషం. అలాగే విశ్వకర్మ జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఆదివారం ఉదయం 9.30 గంటలకు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ కొత్త పార్లమెంట్‌ భవనం ప్రాంగణానికి చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, కేంద్రమంత్రి వీ మురళీధరన్‌, పీయూష్‌ గోయల్‌, అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, కాంగ్రెస్‌ ఎంపీలు అధిర్‌ రంజన్‌ చౌదరి, ప్రమోద్‌ తివారీ తదితరులు పాల్గొన్నారు.

Also Read: PM Modi Slept on Train Floor: ప్రధాని మోదీ టికెట్ ఉన్నప్పటికీ రైలులో కింద ఎందుకు పడుకున్నారో తెలుసా..!?

ఈ కార్యక్రమానికి మల్లికార్జున్ ఖర్గే హాజరుకాలేదు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి తాను హాజరు కాలేనని ఇప్పటికే రాజ్యసభ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. తాను ప్రస్తుతం హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యానని చెప్పారు.జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి మల్లికార్జున్ ఖర్గేకు సెప్టెంబర్ 15 సాయంత్రం ఆహ్వానం అందింది.

సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక సమావేశానికి ఒకరోజు ముందు ఈ కార్యక్రమం జరిగింది. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక సమావేశాలు పాత భవనంలో ప్రారంభమై కొత్త భవనానికి మారుస్తారు. మే నెలలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించిన కొత్త పార్లమెంట్‌లో జరిగే తొలి సెషన్ ఇదే కావడం విశేషం. పార్లమెంట్ ప్రత్యేక సమావేశానికి ముందు ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు అఖిలపక్ష సమావేశం కూడా జరగనుంది. పాత పార్లమెంట్ హౌస్‌లో కేబినెట్ మంత్రుల గదులు గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండగా, ఇప్పుడు కొత్త పార్లమెంట్ హౌస్‌లో మొదటి అంతస్తులో వారి గదులను కేటాయించారు.