Site icon HashtagU Telugu

Rs 80 Cr Cocaine: హైదరాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ స్వాధీనం..!!

Cocaine Imresizer

Cocaine Imresizer

శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా కొకైన్ పట్టుబడింది. ఇద్దరు విదేశీయుల నుంచి దాదాపు రూ. 80కోట్ల విలువైన కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. టాంజానియా, కేప్ టౌన్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకులను తనిఖీ చేయగా…ఒక్కొక్కరి వద్ద నాలుగు కేజీల చొప్పున కొకైన్ బయపడింది. కొకైన్ తరలిస్తున్న మహిళ, మరో వ్యక్తిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

ట్రాలీ బ్యాగ్ లో అడుగుభాగాన కొకైన్ పెట్టి తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. డ్రగ్స్ తరలిస్తున్నట్లు పక్కా సమాచారం అందడంతోనే నిఘా పెట్టామని డీఆర్ఐ అధికారులు తెలిపారు. దేశంలోపలు ఎయిర్ పోర్టుల్లో పట్టుకున్ కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం రూ. 3500కోట్లు ఉంటుందని అంచనా వేశారు. దీంతోపాటు 303 కిలోల కొకైన్ ట్యూటికోరిన్ పోర్టులో సీజ్ చేసినట్లు అధికారులు వివరించారు.