Site icon HashtagU Telugu

Telangana: మంచిర్యాలలో 5.50 లక్షల నగదు స్వాధీనం

Telangana (22)

Telangana (22)

Telangana: తెలంగాణలో ఎన్నికల సందర్భంగా పోలీస్ యంత్రాంగం జిల్లా స్థాయిలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. అందులో భాగంగా సరైన ఆధారాలు, రసీదులు లేని పెద్ద మొత్తంలో నగదుని స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అక్రమ నగదు, బంగారం, వెండి పట్టుబడుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల కోట్లలో డబ్బు స్వాధీనం చేసుకున్న పోలీసులు తాజాగా మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్ చెక్ పోస్ట్ దగ్గర రూ. 5.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

సీసీసీ నస్పూర్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కుస్నపల్లి గంగారాం అనే వ్యక్తి రూ. 5.50 లక్షల నగదును తీసుకెళ్తున్నాడు. పోలీసుల తనిఖీలో దొరకగా, గంగారాం ఈ డబ్బుకు సరైన పత్రాలు చూపించలేకపోయాడు. నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు.

Also Read: Telangana: ఎమ్మెల్యే, మంత్రులకు ఇకపై పోలీస్ సెల్యూట్ ఉండదు

Exit mobile version